thandel Bujji Thalli song
Bujji Thalli song: ''నీకోసం.. వేచుందే.. నా ప్రాణం ఓ బుజ్జితల్లి.. నాకోసం ఓ మాటైనా మాటాడే బుజితల్లి''.. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఈ ఒక్క పాటతో మారుమోగిపోతుంది. ఎవరి ఫోన్లలో చూసిన.. ఎక్కడ చూసిన బుజ్జితల్లి పాటే వినిపిస్తోంది. ఈపాటపై రీల్స్, వీడియోలు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. సినిమాను పక్కన పెడితే ఈ పాట హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటకు రాలేదు కొంతమంది మ్యూజిక్ ప్రియులు. ఆ రేంజ్ లో మ్యూజిక్ కొట్టాడు డీఎస్పీ. ముఖ్యంగా బుజ్జితల్లి ఫీమేల్ వెర్షన్ మరింత ట్రెండ్ అవుతోంది.
100 మిలియన్ వ్యూస్
అయితే రిలీజైన రోజు నుంచి ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దుమ్మురేపుతోంది. తాజాగా 100 మిలియన్ వ్యూస్ హిట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. అంతేకాదు ప్లే లిస్టులో అత్యంత ఇష్టమైన పాటగా రికార్డు క్రియేట్ చేసింది.
The most loved song in your playlist and the most celebrated song on the big screens 😍#BujjiThalli from #Thandel hits 100 MILLION+ VIEWS on YouTube ❤️🔥
— Geetha Arts (@GeethaArts) February 15, 2025
▶️ https://t.co/ZqKgx9roRi
A 'Rockstar' @ThisIsDSP soulful melody 🎼
Book your tickets for the DHULLAKOTTESE BLOCKBUSTER… pic.twitter.com/G23rQjbS7E
నాగచైతన్య - సాయి పల్లవి జంటగా ఫిబ్రవరి 7న విడుదలైన 'తండేల్ ' బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంత చేసుకుంది. దాదాపు రూ. 75 కోట్లతో రూపొందిన ఈమూవీ ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. 8 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 95. 20 కోట్ల వసూళ్లను సాధించింది. ఇంకా థియేటర్స్ లో జోరు కొనసాగిస్తూనే ఉంది.
Also Read: Prabhas Fauji: ప్రభాస్ సెట్ లోకి బాలీవుడ్ సీనియర్ యాక్టర్.. పోస్టుతో కన్ఫర్మ్!