Pakistanis: భారత్ మంచితనం.. లక్షా 50 వేల మంది పాకిస్తానీలు సేఫ్‌

భారత్ మంచితనం వల్ల లక్షా 50 వేల మంది పాకిస్తానీలు సేఫ్‌ అయ్యారు. భారీ వరదలు వస్తున్నాయని పాకిస్తాన్ ను భారత్ ముందే హెచ్చరించింది. సట్లెజ్,  చినాబ్, రావి,  తదితర నదులపై ఉన్న జలశయాల గేట్లు ఎత్తబోతున్నామని రెండు రోజుల క్రితమే భారత్ సూచించింది.

New Update
pakistan

Pakistanis

Pakistanis: భారత్(India) మంచితనం వల్ల లక్షా 50 వేల మంది పాకిస్తానీలు సేఫ్‌ అయ్యారు. భారీ వరదలు వస్తున్నాయని పాకిస్తాన్ ను భారత్ ముందే హెచ్చరించింది. సట్లెజ్,  చినాబ్, రావి,  తదితర నదులపై ఉన్న జలశయాల గేట్లు ఎత్తబోతున్నామని రెండు రోజుల క్రితమే భారత్ సూచించింది. భారత్ హెచ్చరికతో పాకిస్తాన్ అలెర్ట్ అయింది. ఆ దేశంలోని ప్రావిన్స్ లోని 1.50లక్షల మందిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.   ఇండియా సహాయం వల్లే బ్రతికామంటూ పాకిస్థానీల సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి థ్యాంక్స్‌ చెబుతున్నారు. మోదీ ముందుచూపు తమను రక్షించిందంటున్నారు పాకిస్తానీలు.  

Also Read:భారత్‌కు ట్రంప్ వినాయక చవితి బంపరాఫర్.. ఆ ఒక్క పని చేస్తే 25 శాతమే సుంకాలు

Also Read: భారత్ మంచితనం.. లక్షా 50 వేల మంది పాకిస్తానీలు సేఫ్‌

వరదలు తీవ్ర విధ్వంసం

పాకిస్తాన్‌లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది రుతుపవనాల కాలంలో ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్, పంజాబ్, సింధ్ వంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా, ఆగస్టు మధ్యకాలం నుంచి పరిస్థితి మరింత దిగజారింది. గత జూన్ 26 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 800 మందికి పైగా మరణించారు. వారిలో సగం మందికి పైగా ఆగస్టు నెలలోనే మరణించారు. కేవలం బునేర్ జిల్లాలోనే ఆకస్మిక వరదల కారణంగా 300 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

Also Read:వచ్చేసిన తేజ సజ్జా మిరాయ్ ట్రైలర్.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా!

వాతావరణ మార్పుల వల్లనే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 2022లో కూడా పాకిస్తాన్‌లో మూడింట ఒక వంతు దేశం నీట మునిగింది. ఆ ఘటనలో 1700 మందికి పైగా చనిపోయారు. ఈ ఏడాది కూడా అదే విధమైన పరిస్థితి మళ్లీ ఏర్పడుతుందేమోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు