CM Revanth Reddy : మోదీ కులగణన నిర్ణయం.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్!

రాబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రధాని, కేంద్ర కేబినెట్‌కు ధన్యవాదాలు తెలిపారు.

New Update
cm revanth reddy caste census

cm revanth reddy caste census

రాబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.  ఈ సందర్భంగా ప్రధాని, కేంద్ర కేబినెట్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  కేంద్ర నిర్ణయంతో రాహుల్‌ గాంధీ విజన్‌ సాకారం కాబోతుందని సీఎం రేవంత్ తెలిపారు. రాహుల్‌ గాంధీ విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని ప్రభావితం చేశారని రేవంత్ అన్నారు.  దేశంలో కులగణన చేపట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు.  రాహుల్‌ గాంధీ విజన్‌తో తెలంగాణలో కులగనణ చేపట్టామన్న రేవంత్..  కులగణన కోసం కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడిందని తెలిపారు. తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తోందని మరోసారి రుజువైందని రేవంత్ తెలిపారు.  

Also read : తుంగతుర్తి కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. ఎమ్మెల్యే సామేలుకు వ్యతిరేకంగా ఆందోళన!

రాహుల్ గాంధీ కల కన్నది ఇదే

భారత్ జోడో యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ, కుల గణన అవసరాన్ని గుర్తించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు కేంద్రం కూడా కులగణన చేసేందుకు అంగీకరించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ,  కేబినెట్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.  తమ నాయకుడు రాహుల్ గాంధీ కల కన్నది ఇదే. ఆయన కల నెరవేరడం చూసి తాము సంతోషంగా ఉన్నామని తెలిపారు.  

Also Read :  తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్‌లో సత్తాచాటిన మహబూబాబాద్.. ఆఖరి స్థానంలో ఏ జిల్లా అంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు