ఓరి కామాంధుడ.. బాలికలు స్నానం చేస్తుండగా వార్డెన్ అరాచకం..

ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆశ్రమ పాఠశాలలు బాలికలు స్నానం చేస్తుండగా వార్డెన్‌ వీడియోలు తీయడం కలకలం రేపింది. దీంతో అతడిని అధికారులు సస్పెండ్ చేశారు.

New Update
Warden Suspeds after recording videos of girls bathing in Adilabad

Warden Suspeds after recording videos of girls bathing in Adilabad

ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆశ్రమ పాఠశాలలు బాలికలు స్నానం చేస్తుండగా వార్డెన్‌ వీడియోలు తీయడం కలకలం రేపింది. దీంతో అతడిని అధికారులు సస్పెండ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బేల మండలం చాంద్‌పల్లి ఆశ్రమ పాఠశాలలో జి.ఆనందరరావు అనే వ్యక్తి వార్డెన్‌గా పనిచేస్తున్నారు. అతడు బాలికలు స్నానం చేస్తుండగా వీడియోలు తీయడాన్ని అక్కడి విద్యార్థినిలు గమనించారు. 

Also Read: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు బిగ్‌ అలర్ట్‌.. కేరళలో కొత్త వైరస్

దీంతో ఇటీవల ఆ పాఠశాలను షీ టిమ్‌ సందర్శించింది. అక్కడ ఓ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే బాలికలు ఈ విషయాన్ని వాళ్లకు చెప్పారు. దీంతో పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు. శుక్రవారం రాత్రి ఆనందరావుపై పోక్సో కేసు నమోదు చేశారు. శనివారం అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అంతేకాదు అతడిని విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అంబాజీ ఉత్తర్వులు జారీ చేశారు. 

Also Read: బీహార్‌లో మరో ముగ్గురు కవితలు.. అక్కడా, ఇక్కడా ఓటమి తర్వాతే పరి‘వార్’!

Advertisment
తాజా కథనాలు