/rtv/media/media_files/2026/02/14/telangana-2026-02-14-09-03-22.jpg)
Telangana Municipal Elections 2026: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠకు తెరలేపింది. గెలుపు ఓటముల మధ్య అంతరం కేవలం \ఒక్క ఓటు కావడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పలు చోట్ల రీకౌంటింగ్ నిర్వహించిన తర్వాతే తుది ఫలితాలను(Municipal Election Results 2026) ప్రకటించాల్సి వచ్చింది. కాంగ్రెస్, BRS అభ్యర్థుల మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరులో అదృష్టం ఎవరిని వరించిందో చూద్దాం.
Also Read : మంత్రి పదవి ఇవ్వకుంటే డైరెక్ట్ సీఎం అవుతా.. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఒక్క ఓటుతో గెలుపు తీరానికి..
మున్సిపాలిటీల్లో గెలుపు కోసం అభ్యర్థులు చేసిన పోరాటం చివరి నిమిషం వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ముఖ్యంగా ఐదు చోట్ల కేవలం ఒక్క ఓటు తేడాతో విజేతలు ఖరారయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయాల్లో ప్రతి ఓటు విలువైనదే అని మరోసారి నిరూపించాయి. కేవలం ఒక్క ఓటుతో అధికారాన్ని కోల్పోయిన అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం పట్టుబట్టడంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. చివరకు అధికారికంగా ఫలితాలు వెలువడటంతో గెలిచిన వారు సంబరాలు చేసుకోగా, ఓడిన వారు నిరాశతో వెనుదిరిగారు.
మిర్యాలగూడ (18వ వార్డు): ఇక్కడ మొత్తం 1,711 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులుకు 837 ఓట్లు రాగా, భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌కు 836 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ నిర్వహించినా ఫలితంలో మార్పు లేకపోవడంతో సైదులు ఒక్క ఓటుతో గెలుపొందారు.
పరకాల (17వ వార్డు): ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకంగా మారాయి. BRS అభ్యర్థి రజనికి 368 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సుభద్రకు 366 ఓట్లు వచ్చాయి. అయితే, పోలైన 3 పోస్టల్ ఓట్లు సుభద్రకే పడటంతో ఆమె ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు.
గద్వాల (8వ వార్డు): కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ (465 ఓట్లు) తన సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థి జయమ్మ (464 ఓట్లు)పై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
కొల్లాపూర్ (2వ వార్డు): ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి జయలక్ష్మి, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మపై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు.
కల్వకుర్తి (10వ వార్డు): కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్, గులాబి పార్టీ అభ్యర్థి తాహెర్‌పై ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉత్కంఠను రేపారు.
Also Read : పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ ఘోర పరాజయం.. సింగిల్ డిజిట్ కే పరిమితం
రామగుండంలో డ్రా.. ఆపై ఉత్కంఠ విజయం
రామగుండం 59వ డివిజన్‌లో ఫలితం మరింత చిత్రంగా మారింది. మొదట కాంగ్రెస్ అభ్యర్థి ఖాజాసనా, ఏఐఎఫ్‌బీ (AIFB) అభ్యర్థి బాలసాని తిరుపతికి సమాన ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు రీకౌంటింగ్ చేపట్టారు. గతంలో 'చెల్లని ఓట్లు'గా పక్కన పెట్టిన 4 ఓట్లను తిరిగి పరిశీలించగా, అందులో రెండు ఓట్లు తిరుపతికి అనుకూలంగా చెల్లుబాటవుతాయని తేలింది. దీనితో ఏఐఎఫ్‌బీ అభ్యర్థి రెండు ఓట్ల తేడాతో విజేతగా నిలిచారు.
Follow Us