/rtv/media/media_files/2025/04/18/zfaFyOdhKiW8oHtsT09A.jpg)
Upendra 45 Movie
Upendra 45 Movie: ఒకొనొక టైమ్ లో కన్నడ ఇండస్ట్రీ అంటే కేవలం మాస్ రీమేక్ సినిమాలకే పరిమితమయ్యేది. కంటెంట్ పరంగా, కమర్షియల్ గా కూడా తెలుగు, తమిళ ఇండస్ట్రీల కంటే వెనుకబడి ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి శాండిల్‌వుడ్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కేజీఎఫ్, కాంతార, చార్లీ 777, గరుడ గమన వృషభ వాహన వంటి సినిమాల విజయం కన్నడ సినిమాల రేంజ్ మార్చేసింది.
Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!
ఈ నేపధ్యంలో, కన్నడ నుండి మరో భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది- అదే '45'. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, ఉపేంద్ర, దర్శకుడు-నటుడిగా ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజ్.బి.శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: మరో బడా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.
విజువల్స్ మైండ్ బ్లోయింగ్..
తాజాగా విడుదలైన 45 టీజర్ ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కథ విషయాన్ని స్పష్టంగా చెప్పకపోయినా, విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. టీజర్ ఓ భావోద్వేగ డైలాగ్‌తో మొదలవుతుంది- ‘‘మనిషి చనిపోయాక ప్రేమ చూపడం కంటే బతికుండగానే చూపిస్తే బాగుంటుంది’’. ఈ డైలాగ్‌తోనే సినిమా కాన్సెప్ట్ ను చెప్పే ప్రయత్నం చేశారు.
Also Read: చక్రం క్లైమాక్స్ రిపీట్.. ప్రభాస్ ను చంపబోతున్న మరో డైరెక్టర్..?
రాజ్.బి.శెట్టి పాత్ర ఈ సినిమాలో అత్యంత గంభీరంగా ఉండనుందని తెలుస్తోంది. ఉపేంద్ర, శివన్న డిఫరెంట్ లుక్స్‌తో అలరిస్తున్నారు. టీజర్‌లో ఉపేంద్ర చెప్పిన- ‘‘ఈ చిత్రానికి దర్శకుడు నేను’’, అన్న డైలాగ్‌కి శివరాజ్ కుమార్ ‘‘అందులో హీరో నేను’’ అని ఇచ్చిన కౌంటర్ ప్రేక్షకుల ఆసక్తిని మరింతగా పెంచుతోంది.
ఈ చిత్రాన్ని అర్జున్ సన్య తెరకెక్కిస్తున్నారు. టీజర్ చూస్తే, కథను పూర్తిగా వెల్లడించకుండా, గతంలో ఉపేంద్ర దర్శకత్వం వహించిన సినిమాల స్టైల్‌ను గుర్తుకు తెస్తోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ 45 చిత్రం, ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది.