Bomb Threat : వరంగల్‌ కోర్టులో బాంబుల కలకలం..హై అలెర్ట్‌ ప్రకటించిన పోలీసులు

వరంగల్‌ కోర్టులో బాంబుల కలకలం రేగింది. కోర్టు ఏరియాలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేయడంతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆరు డిటోనేటర్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

New Update
Warangal Court

Warangal Court

Bomb Threat : వరంగల్‌ కోర్టులో బాంబుల కలకలం రేగింది. కోర్టు ఏరియాలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేయడంతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించడంతో పాటు ప్రజలను భయాభ్రాంతులకు గురిచేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు  కోర్టులో తనిఖీలు చేపట్టారు. ఈ రోజు ఉదయం  డయల్100 నెంబర్‌కి ఫోన్ చేసిన ఒక అగంతకుడు కోర్టులో బాంబ్‌ పెట్టినట్లు  చెప్పడంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. కాగా అగంతకుడు చెప్పినట్లే ఈ తనిఖీల్లో కోర్టు ఆవరణలో పెట్టిన ఆరు డిటోనేటర్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి:ఈ పండు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందా? నిజాలేంటి?


 గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పోలీసులు ప్రత్యేకంగా బాంబ్‌ స్క్వాడ్ ను రప్పించి కోర్టుతో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. డిటోనెటర్లు లభించడంతో హై అలెర్ట్‌ ప్రకటించిన పోలీసులు కోర్టుకు సమీపంలో ఉన్న ప్రజలను అక్కడినుంచి దూరంగా పంపించివేశారు.  కాగా  ఫోన్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవరు చేశారనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పోన్‌ చేసిన వ్యక్తే బాంబులు పెట్టాడా? లేక ఎవరైనా పెడుతుండగా చూసి కాల్‌ చేశాడా అనేది పోలీసుల ఎంక్వయిరీలో తేలనుంది.

ఇది కూడా చదవండి: తెల్ల బెర్రీలు డయాబెటిస్‌తోపాటు అనేక వ్యాధులను దూరం చేస్తాయి..!

Advertisment
తాజా కథనాలు