/rtv/media/media_files/2024/12/16/pkx6qi418EFcbIUkOGFZ.jpg)
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎగ్జామ్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేస్తూ బోర్డు కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న ఈ పరీక్షల్లో భాగంగా.. మార్చి 3వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షలను ఒక రోజు వెనక్కు జరిపారు. మార్చి 3న హోలీ పండుగ సందర్భంగా..ప్రభుత్వం ఆ రోజు అధికారిక సెలవు ప్రకటించింది. దీంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల తేదీని మార్చారు.
ఒక రోజు వెనక్కు..
ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జగరనున్నాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్.. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.మార్చి 3న జరగాల్సిన మ్యాథమెటిక్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను ఇప్పుడు మార్చి 4వ తేదీన నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం మార్చి 2న గణితం 1ఏ, బోటనీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయి.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్..
మార్పులు చోటు చేసుకున్న తర్వాత ప్రకటించిన తాజా పరీక్షల షెడ్యూల్ ప్రకారం..ఫిబ్రవరి 25న.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షతో.. రాత పరీక్షలు మొదలవుతాయి. ఫిబ్రవరి 26న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో.. వరుసగా మొదటి , రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 2 వ తేదీన.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరుగుతాయి. మార్చి 4వ తేదీన సవరించిన తేదీ ప్రకారం సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ఉంటాయి. మార్చి 5 , 6వ తేదీల్లో.. ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ 1బీ/2బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు ఉంటాయి. మార్చి 9 , 10 తేదీల్లో.. ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు వరుసగా రెండు సంవత్సరాల విద్యార్థులకు జరుగుతాయి. మార్చి 12 , 13వ తేదీల్లో కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలతో ముగుస్తాయి. మరోవైపు ప్రాక్టికల్స్ పరీక్ష తేదీల్లో మాత్రం ఎటువంటి మార్పులూ చోటు చేసుకోలేదు. ఇవి ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. సవరించిన పూర్తి షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచారు.
Follow Us