Mid Manair: మాజీ సీఎం కేసీఆర్ మరో షాక్ తగిలింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల కుంగిపోవడం, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ కేసులలో విచారణలతో ఇక్కట్లు పడుతున్న కేసీఆర్ కు ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ కు సంబంధించిన కేసు విచారణ మరింత ఇబ్బందుల్లోకి నెత్తినట్లు అయింది. 2016లో మిడ్ మానేరులో జరిగిన ప్రమాదంపై విజిలెన్స్ అధికారులు సంచలన రిపోర్ట్ ను ప్రభుత్వనికి అందించారు. అసలు విషయానికి వస్తే 2016లో మిడ్ మానేరు కట్ట కొట్టుకుపోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించిన.. అది నామమాత్రం గానే సాగింది. ఈ ప్రమాదంపై ఎలాంటి నివేదిక బయటకు రాలేదు.
Also Read: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు
అధికారుల నిర్లక్ష్యమే...
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు విచారణలో వేగం పెంచారు. 2016లో మిడ్‌మానేరు ప్రాజెక్టు కొట్టుకుపోయేందుకు గల కారణాలపై విజిలెన్స్ అధికారులు సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు. డ్యామ్ నిర్మాణం చేపట్టే సమయంలో ఎర్త్‌బండ్ కన్నా స్పిల్‌వే ఎత్తు పెరిగిందని.. ఈ కారణం వల్ల వరద వస్తే ఆనకట్ట కొట్టుకుపోతుందని తెలిసినా అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పట్టించుకోలేదని విజిలెన్స్ అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం.
Also Read: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు
పెరిగిన వ్యయం..
మిడ్ మానేరు ప్రోజెక్ట్ కట్ట కొట్టుకుపోవడానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఎంత ఉందొ.. అధికారుల నిర్లక్ష్యం కూడా అంతే ఉందని నివేదికలో విజిలిన్స్ అధికారులు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఎర్త్ బండ్‌కు 130 మీటర్ల మేర గండి పడి నష్టం జరిగిందని.. ఆ పనులను చేపడుతున్న ఐవీఆర్సీఎల్ అనే కంపెనీని అధికారులు పక్కన పెట్టేశారని తెలిపింది. అయితే, అప్పటికే ఆ పనులను రూ.122.30 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారని... సంస్థను పక్కనపెట్టాక అంచనా వ్యయాన్ని రూ.347 కోట్లకు ఒకేసారి పెంచేశారని ప్రాథమికంగా విజిలెన్స్ గుర్తించినట్టు సమాచారం. కాగా ఇప్పటికే నివేదిక తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. అయితే.. ఈ విచారణలో భాగంగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.