Mancherial: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఊహించని తీర్పు.. పెద్ద షాకే ఇది మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు నిర్వహించారు. 27 మందిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారంతా వారం రోజుల పాటు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని న్యాయమూర్తి ఉపనిషద్విని తీర్పు ఇచ్చారు. By Seetha Ram 07 Nov 2024 in తెలంగాణ ఆదిలాబాద్ New Update షేర్ చేయండి రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎక్కువగా యువతే ప్రాణాలు విడుస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. Also Read : ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై సైతం కేసులు పెట్టి శిక్షలు విధిస్తున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వారిలో మార్పు రావడం లేదు. అంతకంతకు మరింత ఎక్కువ చేస్తున్నారు. దీంతో విసుగెత్తిపోయిన న్యాయస్థానం అనూహ్య తీర్పును వెలువరించింది. Also Read : సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్! డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి సరైన శిక్ష విధించింది. ఇందులో భాగంగానే ఇటీవల మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు నిర్వహించగా.. దాదాపు 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ట్రాఫిక్ పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇందులో భాగంగానే ఈ కేసును పరిశీలించిన మంచిర్యాల మొదటి అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఉపనిషద్విని ఊహించని తీర్పు ఇచ్చారు. Also Read : 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికే ఊహించని తీర్పు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారంతా గురువారం నుంచి సుమారు వారం రోజుల పాటు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని తీర్పునిచ్చారు. ఇందులో భాగంగానే వాహనదారులు నింబంధనలు పాటించాలని లేనియెడల కఠన చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ సత్యన్నారాయణ తెలిపారు. Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే .. . #drunk-and-drive #mancherial #latest telangana news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి