/rtv/media/media_files/2025/10/08/cough-syrup-2025-10-08-15-15-31.jpg)
Cough Syrup
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు దగ్గు మందులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రీలైఫ్, రెస్పీఫ్రెష్‌టీఆర్‌ను కొనుగోలు చేయొద్దని అందులో పేర్కొంది. ఈ రెండు కాఫ్ సిరప్‌లలో కల్తీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇవి గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీల ఔషధాలని పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కోల్ట్‌రిఫ్ దగ్గు మందు వినియోగించడం వల్ల పలువురు చిన్నారులు మృతి చెందినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. ఇప్పటికే ఔషధ నియంత్రణ విభాగం (DCGA) కోల్డ్‌రిఫ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ సర్కార్ రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ దగ్గు సిరప్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
రెండు దగ్గు సిరప్‌లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2025
రిలైఫ్, రెస్పీఫ్రెష్ అనే రెండు దగ్గు సిరప్‌లలో డైథిలైన్ గ్లైకాల్ అనే ప్రమాదకరమైన కెమికల్‌ను వాడుతున్నారని, వాటిని వాడొద్దని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డీసీఏ https://t.co/3I5fNzTOFapic.twitter.com/XMPSXobdF9
ఇదిలాఉండగా సెప్టెంబర్ 7 నుంచి 20వ తేదీ మధ్య మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో కిడ్నీ ఫెయిల్ అయ్యి 9 మంది చిన్నారులు మృతి చెందారు. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో కూడా పలువురు మృతి చెందారు. అయితే వీళ్లలో ఐదుగురు కోల్డ్‌రెఫ్, మరొకరు నెక్స్‌ట్రో కాఫ్ సిరప్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. ఈ సిరప్‌లపై పరిశోధనలు ప్రారంభించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్, ది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇతర ఏజెన్సీలు చింద్వారా జిల్లాలో పర్యటించాయి. చనిపోయిన చిన్నారులు వాడిన దగ్గు మందు శాంపిళ్లను పరిశీలించగా.. ఆ మందులు కలుషితం కాలేదని తేలింది. అయినప్పటీకీ చిన్నారులకు దగ్గు మందును పరిమితంగా వాడాలని DCGA ఆదేశించింది. అనంతరం కోల్డ్‌రిఫ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
Also Read: 15ఏళ్ల బాలికతో వ్యభిచారం.. సినీ నటుడు సహా ఐదుగురు అరెస్టు