కేవలం రూ.48 చెల్లిస్తే.. నెలంతా అన్ లిమిటెడ్ జర్నీ.. TSRTC బంపరాఫర్!

TSRTC ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. కేవలం రూ.1450కే మెట్రో డీలక్స్ మంత్లీ పాస్ అందించనున్నట్లు తెలిపారు. అంటే రోజుకు కేవలం రూ.48 ఖర్చుతో అన్ లిమిటెడ్ గా ప్రయాణించవచ్చు. ఇంకా ఈ పాస్ ఉన్న వారికి జిల్లా బస్సుల్లో 10% డిస్కౌంట్ ఉంటుంది.

TSRTC Monthly pass
New Update

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సజ్జనార్ అనేక ఆఫర్లను తీసుకువచ్చారు. తద్వారా ప్రయాణికులను ఆర్టీసీకి మరింత దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉండే సజ్జనార్.. ఆర్టీసీ ఆఫర్లు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. తద్వారా ప్రయాణికులకు ఆయా వివరాలను చేరవేస్తూ ఉంటారు. తాజాగా సజ్జనార్ ఆర్టీసీ తీసుకువచ్చిన ఆఫర్ గురించి ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
ఇది కూడా చదవండి: BIG BREAKING: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఖతం.. మోదీ సంచలన ట్వీట్!

జిల్లా బస్సుల్లో 10 శాతం డిస్కౌంట్..

గ్రేటర్ హైదరాబాద్ రీజియన్లో ఆర్టీసీ నడిపే మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించడానికి మంత్లీ పాస్ ను తీసుకువచ్చినట్లు సజ్జనార్ తెలిపారు. రూ.1450కే ప్రయాణికులు ఈ బస్సులో నెలంతా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఈ పాస్ ఉన్న వారికి జిల్లా, ఇంటర్ స్టేట్ బస్సుల్లో పది శాతం డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. 
ఇది కూడా చదవండి: Ashwini Vaishnav: వావ్.. 'త్వరలో గంటకు 280 కి.మీ వేగంతో నడిచే రైళ్లు'

హైదరాబాద్ లో ఉంటూ.. నిత్యం బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ పాస్ సౌకర్యంగా ఉంటుంది. ఈ పాస్ తీసుకున్న వారు మెట్రో డీలక్స్ బస్సులు మాత్రమే కాకుండా.. ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లోనూ జర్నీ చేయవచ్చు. అంటే.. ఏసీ బస్సు తప్పా ఏదైనా ఎక్కొచ్చన్నమాట. నెలకు రూ.1450 అంటే.. రోజుకు కేవలం రూ.48 రూపాయలు మాత్రమే చెల్లించి అన్ లిమిటెడ్ గా ప్రయాణం చేయొచ్చన్న మాట. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా హైదరాబాద్ లో ఉంటూ బస్‌ జర్నీలు చేస్తూ ఉంటే ఈ పాస్ ను తీసుకుని అన్ లిమిటెడ్ గా జర్నీ చేసేయండి మరీ..

ఇది కూడా చదవండి: వివాదాస్పద ఇథనాల్‌ పరిశ్రమ రద్దు.. సర్కార్ సంచలన నిర్ణయం?

Also Read: ఏపీ యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్ ఫోర్స్ పేరు ఈగల్‌‌–హోం మంత్రి అనిత

#tsrtc #vc-sajjanar #good-news #metro-deluxe-bus #tsrtc monthly bus pass
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe