BIG BREAKING: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఖతం.. మోదీ సంచలన ట్వీట్!

తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ తర్వాత తెలుగులో ప్రధాని ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ దుష్ట పాలన భయం జ్ఞాపకాలతో ఉన్న ప్రజలు ఆశగా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు.

New Update
Modi Revanth Reddy

తెలంగాణ బీజేపీ నేతలు ఈ రోజు ప్రధాని మోదీని ఢిల్లీని కలిసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ భేటీపై మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగిందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారన్నారు. అంతేకాక బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుందన్నారు. బీజేపీ కార్యకర్తలు తమ అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారన్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్ పాలన ఎలా ఉంది?: మోదీ ప్రశ్నలకు బీజేపీ నేతలు షాక్!

అధికారమే లక్ష్యంగా పని చేయండి..

ఈ రోజు తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందంతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి పాలన, కేంద్ర పథకాల అమలు గురించి వివరాలు అడిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు వచ్చాయని.. అదే ఉత్సాహంతో అధికారమే లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. 

ఇది కూడా చదవండి: TG: త్వరలో ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి.. భట్టి సంచలన ప్రెస్ మీట్!

రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందని.. కలిసి కట్టుగా పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. మహరాష్ట్రలో విజయం తర్వాత జోష్ మీద ఉన్న బీజేపీ హైకమాండ్ నెక్స్ట్ తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మోదీ నేరుగా ఈ రోజు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: కేవలం రూ.48 చెల్లిస్తే.. నెలంతా అన్ లిమిటెడ్ జర్నీ.. TSRTC బంపరాఫర్!




Also Read: Pawan kalyan: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ పూజారి అరెస్టుపై స్పందించిన పవన్‌

 

Advertisment
Advertisment
తాజా కథనాలు