TS SSC Supplementary Exam Date 2025: విద్యాశాఖ కీలక ప్రకటన.. సప్లిమెంటరీ పరీక్షలపై బిగ్ అప్డేట్

తెలంగాణ SSC పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం విద్యాశాఖ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను వెల్లడించింది. 03.06.2025 నుంచి 13.06.2025 వరకు ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జగరనున్నాయి.

New Update
telangana ssc supplementary exam date 2025

telangana ssc supplementary exam date 2025

తెలంగాణ పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. మార్చి 2025లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 5,09,564 మంది హాజరు అయ్యారు. వారిలో 4,96,374 ముంది రెగ్యులర్ విద్యార్థులు కాగా.. 10,733 ముంది విద్యార్థులు ప్రైవేట్‌గా హాజరయ్యారు.  ఇక ఈ పరీక్షల ఫలితాల్లో మరోసారి బాలికలే హవా చూపించారు. రాష్ట్రంలో పదవ తరగతి రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 92.78% గా ఉంది. అందులో బాలురు సాధించిన ఉత్తీర్ణత శాతం 91.32 % కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 94.26 %గా ఉంది. 

Also Read: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

సప్లిమెంటరీ పరీక్షల తేదీ

ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో పాసయ్యే విధానం ఉంది. తాజాగా ఈ పదవ తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను విద్యాశాఖ వెల్లడించింది. 03.06.2025 నుంచి 13.06.2025 వరకు ఈ పరీక్షలు నిర్వహించననున్నారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 

Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!

అగ్రస్థానంలో మహబూబాబాద్ జిల్లా

ఇదిలా ఉంటే ఈ ఏడాది దాదాపు 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 2 స్కూల్స్ మాత్రం సున్నా శాతం ఫలితాలు పొందాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే 99.29 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్ర స్థానంలో ఉంది. అదే సమయంలో వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతం 73.97 శాతం సాధించి చివరి స్థానంలో ఉంది.

Tg SSC 10th Results 2025 | ts-ssc-exams | telangana

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు