నల్గొండలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. | SSC 10TH Exams In Nalgonda | RTV
TG: 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫీజు చెల్లించాలంటే పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీయాల్సిన అవసరం లేదని.. ఇక నుంచి ఆన్లైన్లోనే చెల్లించవచ్చని పేర్కొంది.
పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. రీకౌంటింగ్కు కూడా 15 రోజుల వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఒక సబ్జెక్టుకు రూ.500 వరకు చెల్లించాలని పేర్కొన్నారు.
తెలంగాణలో ఈ నెల 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల విభాగం డైరెక్టర్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. పరీక్షల సమయంలో నిమిషం నిబంధన ఉండదని తెలిపింది. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతించనున్నట్లు తెలిపింది.
2024లో జరగనున్న తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చి 18నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్ కోసం మొత్తం ఆర్టికల్ ను చదవండి.
ప్రస్తుతం పదో తరగతి సైన్స్ పరీక్షలో రెండు పేపర్లనూ స్వల్ప వ్యవధిలో ఒకే రోజు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. తాజాగా ఆ రెండు పేపర్ల పరీక్షలనూ రెండు వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది.