హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఫార్మా కంపెనీలు దేశంలో పేరుపొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో భారీగా పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. By B Aravind 22 Nov 2024 | నవీకరించబడింది పై 22 Nov 2024 21:07 IST in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో సంప్రదింపులు జరిపారు. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు, టీఎస్ఐఐసీ ఛైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. Also Read: రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేకు షాక్.. రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు Investments In Hyderabad ఈ సందర్భంగా ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఈ ఆరు కంపెనీలు కలిసి రాష్ట్రంలో దాదాపు రూ.5260 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12490 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది. ఎంవోయూల ఒప్పందాల ప్రకారం ఎంఎస్ఎన్ లాబోరేటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు ఆర్ అండ్ డీ సెంటర్ నెలకొల్పనుంది. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి. Also Read: Iran: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు గ్లాండ్ ఫార్మా ఆర్ అండ్ డీ సెంటర్, ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్స్టన్స్ మాన్యుఫాక్చర్ యూనిట్లను స్థాపించనుంది. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తుంది. హెటిరో ల్యాబ్స్ ఫినిషిడ్ డోస్, ఇంజక్టబుల్ తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. మరో నాలుగు నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించటంతో పాటు, ఫార్మా సిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. Also Read: మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: ఉక్రెయిన్ మాజీ కమాండర్ డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ డైరెక్టర్ సతీష్ రెడ్డి, లారస్ ల్యాబ్స్ ఈడీ వివి రవికుమార్, గ్లాండ్ ఫార్మా సీఈవో శ్రీనివాస్, ఎంఎస్ ల్యాబ్స్ సీఎండీ ఎంఎస్ఎన్ రెడ్డి, అరబిందో డైరెక్టర్ మదన్మోహన్ రెడ్డి, హెటిరో గ్రూప్ ఎండీ బి.వంశీకృష్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు. Also Read: ఒక్కసారిగా 2000 పాయింట్లు పైకెగిసిన సెన్సెక్స్..7 లక్షల కోట్ల లాభం #hyderabad #telugu-news #pharma-company మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి