Telangana: ముగిసిన తెలంగాణ పంచాయతీ ఎన్నికలు..

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఈ విడుతలో భాగంగా 3752 గ్రామాలకు, 28410 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది , వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీ చేశారు.

New Update
third phase of panchayat election concludes in telangana

third phase of panchayat election concludes in telangana

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఈ విడుతలో భాగంగా 3752 గ్రామాలకు, 28410 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది , వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీ చేశారు. 53 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.78 శాతం పోలింగ్ నమోదైంది. డిసెంబర్ 11న జరిగిన మొదటి దశకు 84.28 శాతం, 14న జరిగిన రెండో దశకు 85.86 శాతం పోలింగ్ రికార్డయ్యింది. మొత్తానికి ఈరోజుతో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి.    

Also Read: 148 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి ఓటు వేసిన మాజీ జవాన్

తొలిదశలో 4227 స్థానాలకు ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2331, బీఆర్‌ఎస్ 1168, బీజేపీ 189, ఇతరులు 539 స్థానాల్లో గెలుపొందారు. రెండో దశలో 4325 స్థానాలకు కాంగ్రెస్ 2245, బీఆర్‌ఎస్ 1188, బీజేపీ 268, ఇతరులు 624 స్థానాల్లో విజయం సాధించారు. ఇక మూడో విడతలో 3752 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. రాత్రి 8 గంటల వరకు కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 1850, బీఆర్‌ఎస్ 960, బీజేపీ 180, ఇతరులు 390 సర్పంచ్‌ స్థానాల్లో గెలుపొందారు.

Also Read: ఒక్కో ఓటుకు రూ.1.50 లక్షలు.. సర్పంచ్ ఎన్నికల్లో ఆల్ టైం రికార్డ్.. ఎక్కడో తెలుసా?

ఇదిలాఉండగా రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు డిసెంబర్‌ 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముందుగా డిసెంబర్ 20 అనుకోగా దాన్ని రద్దు చేస్తూ పంచాయతీ రాజ్‌శాఖ ప్రకటన చేసింది. డిసెంబర్‌ 22ను అపాయింటెడ్ తేదీగా ఖరారు చేసింది. డిసెంబర్ 20న సరైన ముహూర్తాలు లేవనే కారణంతో పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వాన్ని తేదీని మారుస్తూ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రెండు రోజులకు వాయిదా వేసింది. 

Advertisment
తాజా కథనాలు