Telangana: 148 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి ఓటు వేసిన మాజీ జవాన్

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిసింది. ఓటు వేసేందుకు నగరాలు, పట్టణాలు సహా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంత గ్రామాలకు వచ్చారు. అయితే ఓ మాజీ ఆర్మీ జవాన్ సైకిల్‌పై ఏకంగా 148 కిలోమీటర్లు ప్రయాణించి తన సొంతూరులో ఓటు వేశారు.

New Update
Ex Jawan

Ex Jawan

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ఓటు వేసేందుకు నగరాలు, పట్టణాలు సహా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంత గ్రామాలకు వచ్చారు. అయితే ఓ మాజీ ఆర్మీ జవాన్ సైకిల్‌పై ఏకంగా 148 కిలోమీటర్లు ప్రయాణించి తన సొంతూరులో ఓటు వేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా మనూర్‌ గ్రామానికి చెందిన మాజీ జవాన్ మల్లయ్య ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. 

Also Read: మెస్సికి అనంత్‌ అంబానీ ఇచ్చిన గిఫ్ట్‌ గురించి తెలిస్తే షాక్!

ఈరోజు ఎన్నికలు ఉండటంతో మల్లయ్య.. ఉదయం 4 గంటలకు బీహెచ్‌ఈఎల్‌ నుంచి సైకిల్‌పై తన సొంతూరుకు బయలుదేరాడు. ఉదయం 10 గంటలకు తన స్వగ్రామం మనూర్‌కు చేరుకున్నాడు. హైదరాబాద్‌ నుంచి తన సొంతూరుకు మొత్తం 148 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి ఓటు వేయడంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఓటు వేసిన తర్వాత మల్లయ్య తన స్నేహితులతో సరదాగా ముచ్చటించి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరాడు. మొత్తానికి తన సైకిల్‌ యాత్రతో ఫిట్‌నెస్ అలాగే పర్యావరణ పరిరక్షణపై అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు మల్లయ్య.  

Also Read: ఒక్కో ఓటుకు రూ.1.50 లక్షలు.. సర్పంచ్ ఎన్నికల్లో ఆల్ టైం రికార్డ్.. ఎక్కడో తెలుసా?

Advertisment
తాజా కథనాలు