Earthquake in Telangana : తెలంగాణలో భూకంపం వచ్చే ఛాన్సే లేదు.. ప్రూఫ్స్ తో సహా చెప్పిన NGRI సైంటిస్ట్!

తెలంగాణ రాష్ట్రానికి భూకంపం ప్రమాదం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలను కొట్టిపారేశారు ఎన్‌జీఆర్‌ఐ (NGRI) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శశిధర్.  ఈ మేరకు ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడారు.

New Update
 National Geophysical Research Institute (NGRI)

National Geophysical Research Institute (NGRI)

Earthquake in Telangana : తెలంగాణ రాష్ట్రానికి భూకంపం ప్రమాదం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలను కొట్టిపారేశారు ఎన్‌జీఆర్‌ఐ (NGRI)  ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శశిధర్.  ఈ మేరకు ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. తెలంగాణలో పెద్దపల్లి కేంద్రంగా భూకంపం వస్తుందని.. అది హైదరాబాద్ సిటీతోపాటు అమరావతి వరకు ఎఫెక్ట్ చూపిస్తుందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. భూకంప ప్రచారాన్ని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూబ్ (NGRI) తీవ్రంగా ఖండించింది. తెలుగు రాష్ట్రాల్లో రామగుండం కేంద్రంగా భూకంపం వస్తుందనేది అవాస్తవం అన్నారాయన.. EPIC లాంటి సంస్థ NGRIకి అప్రోచ్ కాలేదు... అది సైంటిఫిక్ గా ప్రామాణికం కాదని వివరించారు సైంటిస్ట్ శశిథర్. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని.. ఎవరూ భయానికి లోనుకావద్దని వెల్లడించారాయన.

Also Read: HCU భూముల వెనుక రూ.10 వేల కోట్ల స్కామ్.. ఆ బీజేపీ ఎంపీ సహకరిస్తున్నాడు: కేటీఆర్

ఎక్కడైనా భూకంపం వస్తుందని కచ్చితంగా ఎవరూ చెప్పలేరని మన దగ్గర అలాంటి టెక్నాలజీ లేదని తేల్చిచెప్పారాయన. భూకంపాలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారని.. రామగుండం దగ్గర ఇప్పుడు భూకంపం సంకేతాలు ఏమి లేవని.. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని వివరించారు సైంటిస్ట్ శశిథర్. ఏమైనా సమాచారం ఉంటే ప్రభుత్వం లేదా NGRI లేదా జాతీయ స్థాయి రీసెర్చ్ సంస్థలు వెల్లడిస్తాయని.. అప్రమత్తం చేస్తాయని.. అప్పటి వరకు ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దని.. అది అంతా తప్పుడు సమాచారం అని వివరించారు సైంటిస్ట్ శశిథర్. భూకంప వార్తల్లో వాస్తవం లేదని.. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సైంటిస్ట్ శశిథర్ సూచించారు.  ప్రభుత్వ సంస్థలు అధికారికంగా చెప్తే నే ప్రజలు నమ్మాలని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు జోన్ 2, జోన్ 3 లో ఉంటాయని అన్నారు. రామగుండం, గోదావరి పరివాహక ప్రాంతం జోన్ 3 గా ఉంది కానీ భూకంపం సంభవించే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమి లేదని స్పష్టం చేశారు.

Also Read: 19 ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారం.. మోదీ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రాంతం ఎర్త్ ప్లేట్ బౌండరికి దూరంగా ఉండడం వల్ల భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. భూంకపం వచ్చే సంకేతాలు ఉంటే ప్రభుత్వం, ఆయా సంస్థలు ముందే అప్రమత్తం చేస్తాయని చెప్పారు.  ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని.. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా NGRI ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శశిధర్ సూచించారు. 
 

Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు