Konda Surekha : బీసీల పాపం....బీజేపీకి త‌ప్పక త‌గులుద్ది ..రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘాలు ఈ రోజు ఇచ్చిన బంద్‌లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. హైదరాబాద్ రేతిఫైల్‌ బస్టాండ్‌ సమీపంలో ఆందోళనలో పాల్గొన్నారు. బీజేపీ డ్రామా వ‌ల్ల బీసీల ఆశ‌లన్నీ అడియాశ‌ల‌య్యాయని ఆమె ఆరోపించారు.

New Update
Minister Konda Surekha

Minister Konda Surekha

Konda Surekha :  బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘాలు ఈ రోజు ఇచ్చిన బంద్‌ లో అధికార కాంగ్రెస్‌ పార్టీ తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌. బీజేపీ, ఇతర పార్టీలు కూడా మద్ధతు పలకాయి. కాగా ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ రేతిఫైల్‌ బస్టాండ్‌ సమీపంలో జరిగిన బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యక‌ర్తల‌తో క‌లిసి ఆందోళనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండా సురేఖ  బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగ‌లు... బీసీ ద్రోహులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచ‌న మేర‌కు బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని అనుకున్నం... మా ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయిన‌ప్పటికీ చాలెంజ్ గా తీసుకొని బీసీ బిల్లును తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చినం... అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేయించుకున్నం. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మ‌ద్ధతు తెలిపిన బీజేపీ... గ‌వ‌ర్నర్ ఆమోదం తెలుప‌కుండా అక్కడ అడ్డుకుంటూ... దొంగాట ఆట ఆడుతుందని ఆరోపించారు.రాష్ట్ర గ‌వ‌ర్నర్ ఒక్క సంత‌కం పెట్టి... బీసీ బిల్లుకి ఆమోదం తెలిపి ఉంటే ఎక్కడా స‌మ‌స్య వ‌చ్చేది కాదన్నారు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవి. బీజేపీ డ్రామా వ‌ల్ల బీసీల ఆశ‌లన్నీ అడియాశ‌ల‌య్యాయని ఆమె ఆరోపించారు.

Also Read: అఫ్గాన్, భారత్‌తో యుద్ధానికి సిద్ధం.. పాక్‌ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు