/rtv/media/media_files/2025/03/01/lZNFvgFYYsV1eY0MyzDp.jpg)
Former Minister Jagadish Reddy
Former Minister Jagadish Reddy :సూర్యపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో సాగు నీరు సక్రమంగా అందడం లేదని.. పొలాలు ఎండిపోతున్నాయని రైతుల గోస చూస కన్నీరు పెట్టుకున్నారు మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. మండలంలో ఎండిన పంటలను పరిశీలించిన ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.తెలంగాణలో కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలో రైతులకు మేలు జరిగిందని.. కాంగ్రెస్ పాలన వచ్చిన ఏడాదిలోపే పంటలు ఎండిపోతున్నాయని భావోద్వేగానికి గురయ్యారు. తమ ప్రభుత్వం హయాంలో రైతులు వద్దు అనే వరకు నీళ్లిచ్చామని గుర్తు చేశారు. రైతులు వేసిన పంటకు నీరు లేక ఎండిపోవడంతో పశువులను తోలి పంటను మేపుతున్నారని ఆయన తెలిపారు.
Also read: యూఎస్ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు
కేసీఆర్ హయాంలో రైతుల కోసం రైతు బంధు, రుణమాఫీ అందజేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. రైతుల బాధలు కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రమే తెలుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రుణమాఫీ అందరికీ చేయలేదని.. అలాగే రైతు భరోసా కూడా కొందరికే అందిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ లక్ష కోట్లు రైతులకు ఇచ్చిండని మాజీ మంత్రి గుర్తు చేశారు.
Also Read: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల తరపున దండం పెట్టి అడుగుతున్నా తెలంగాణ రైతులకు సాగు నీరు ఇవ్వండి.తెలంగాణ రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితులు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చింది. ఇప్పటికైనా నీరు ఇచ్చి ఎండిపోతున్న పొలాలను బ్రతికించి రైతులను కాపాడండి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా ఎండిపోయిన పొలాలను, రైతుల గోస చూసి భావోద్వేగానికి గురైన జగదీష్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.
Also Read: నన్ను రేప్ చేశారు’.. ప్రైవేట్ పార్ట్‌లో బాటిల్‌తో - సీన్ రివర్స్ కావడంతో మహిళ అరెస్ట్!
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!