Kadiyam Srihari : కల్వకుంట్ల కుటుంబమంతా జైలకెళ్లడం ఖాయం..కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ వనరులను దొచుకుని వేల ఎకరాలు,లక్షల కోట్ల ఆస్తులను సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబమంతా త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని శ్రీహరి ఆరోపించారు.

New Update
Station Ghanpur

Kadiyam Srihari's sensational comments

Kadiyam Srihari : తెలంగాణ వనరులను దొచుకుని వేల ఎకరాలు,లక్షల కోట్ల ఆస్తులను సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబమంతా త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని శ్రీహరి ఆరోపించారు. ఆదివారం స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కోర్టుల్లో కేసుల పేరుతో స్థానిక ఎన్నికలు ఎలాగైనా ఆపాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని కడియం ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే బీసీ రిజర్వేషన్లను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన స్థానిక ఎన్నికల జరగడం ఖాయమని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 250 మంది ప్రజాప్రతినిధులు ఎంపిక  కానున్నారని కడియం చెప్పుకొచ్చారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని అది మన కార్యకర్తల చేతులపైనే ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి అత్యధిక అభివృద్ధి నిధులు తీసుకువచ్చినట్లు కడియం శ్రీహరి చెప్పుకున్నారు.

నియోజక వర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చిత్తశుద్ధితో ఐక్యమత్యంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కడియం సూచించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కచ్చితంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అంతకుముందు ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు తెలిసేలా ప్రచార చేయాలని కోరారు. ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గ్రామాలు, మండలాల్లో నిర్ణయం జరగాలని ఎటువంటి పక్షంలో కూడా తమ ప్రమేయం ఉండదన్నారు. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తల భుజస్కందాలపై పెడుతున్నామని కడియం  తెలిపారు. జనగామ జిల్లా డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీహరి, ఎంపీ కడియం కావ్యలు పాల్గొని మాట్లాడారు.

ఇది కూడా చదవండి: విజయవాడలో సైకో.. దసరా ముందు మటన్ కత్తితో పిన్నిని ముక్కలు ముక్కలుగా
 

Advertisment
తాజా కథనాలు