Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం ముగ్గురు విద్యార్థినులు కనపడకుండా పోవడానికి కారణం అయ్యింది. బాలికలు స్కూల్‌కు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఆరా తీయగా ఈ విషయం బయటపడింది. ఆధార్ కార్డులతో ఇంటినుంచి బయల్దేరిన విద్యార్థినులు బస్సుల్లో షికారు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ప్రకటించారు. Also Read: Tamilanadu: ఉద్యోగులకు సంక్రాంతి బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సులో పొద్దంతా చక్కర్లు.. నవీపేట మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సమీప గ్రామాల్లోని ముగ్గురు బాలికలు పదో తరగతి చదువుతున్నారు. రోజూలాగే స్కూల్‌కు వెళ్తున్నామని చెప్పి గురువారం కూడా ఇంటి నుంచి బయటకు వచ్చారు. బడికి డుమ్మా కొట్టి ఉచిత బస్సులో పొద్దంతా చక్కర్లు కొట్టాలని ముందుగానే ప్లాన్ వేసుకున్న ఆ ముగ్గురు ఆధార్ కార్డులను వెంట తీసుకుని వచ్చారు. స్కూల్ బ్యాగులను ఎక్కడో వదిలేసి ఒక్క దగ్గర కలుసుకున్నారు. Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి ఊహించని సమస్యలు నవీపేట బస్టాండ్‌లో బస్సు ఎక్కి బోధన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ నవీపేట్ మీదుగా నిజామాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి కామారెడ్డికి వెళ్లి తిరిగి నిజామాబాద్‌కు వచ్చారు. అటు నుంచి నవీపేట్‌కు వెళ్లి మళ్లీ నిజామాబాద్‌కు వచ్చి జగిత్యాలకు చేరుకున్నారు. మళ్లీ తిరిగి నిజామాబాద్‌కు చేరుకున్నారు. బాలికలు స్కూల్ లో కనిపించకపోవడంతో ఉపాధ్యాయులు వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరా తీశారు. పిల్లలు పొద్దున్నే ఇంటి నుంచి బయల్దేరారని చెప్పగా, స్కూల్‌కు రాలేదని టీచర్లు వారికి చెప్పారు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు రోజంతా వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించక పోవడంతో నవీపేట్ పోలీసులను కలుసుకుని విషయం చెప్పారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసు అధికారులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అదృశ్యమైన బాలికల్లో ఒకరి దగ్గర ఫోన్ ఉండడంతో, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిజామాబాద్ బస్టాండ్‌లో ఆమెను పట్టుకున్నారు.అయితే మరో ఇద్దరి ఆచూకీ లభించలేదు.నవీపేట ఎస్సై వినయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిజామాబాద్ బస్టాండ్‌లో కాచుకు కూర్చున్నాయి. శుక్రవారం సాయంత్రం ఇద్దరు బాలికలు బస్సు దిగుతుండగా పట్టుకుని నవీపేట్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ముగ్గురు విద్యార్థినులను వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించడంతో విద్యార్థినుల మిస్సింగ్ కథకు ముగింపు వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణం తమ పిల్లలకు ప్రాణ సంకటంగా మారిందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. Also Read: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Also Read: Ap: తల్లికి వందనం పథకం ముహూర్తం కుదిరింది..మంత్రి కీలక వ్యాఖ్యలు!