/rtv/media/media_files/2025/06/15/3bO9ovInbKi8BVBc6Nlb.jpg)
pamela satpathy
Pamela Satpathy
కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాల్లో అధికారులుగా ఉండి తమకంటే తోపులు లేరన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారిని సమాజం ఏ మాత్రం గౌరవించదు. కానీ కొంతమంది ఉన్నత స్థానంలో ఉన్నా ప్రజలతో మమేకమై ప్రజల మనుసులు గెలుచుకుంటారు. వారిని ప్రజలు కూడా అధికారులు అనుకోకుండా అయినవారు అనుకుంటారు. అలాంటి కోవకు చెందిన అధికారే కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. ఉద్యోగ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఆమె మహిళా సాధికారత, చిన్నారుల విద్యా కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే తన పనితీరుతో పలువురి మన్ననలు అందుకున్న పమేలా తాజాగా జోలపాట పాడి అందరి మనసులు గెలుచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ చిన్నారి పాపకు పమేలా సత్పతి జోల పాట పాడింది. ఆమె పాటకు చిన్నారి కూడా శ్రద్ధగా వింటూ కలెక్టర్ ఒడిలో ఒదిగిపోయింది. ‘పియు బోలే’ అనే హిందీ పాటను ఎంతో చక్కగా జోల పాటల పాడి.. పాపను నిద్రపుచ్చారు.
Also Read: ప్రతిరోజూ ఒక గ్లాసు బెల్లం పాలు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది?
కాగా ఈ పాట పరిణీత అనే హిందీ చిత్రంలోనిది. ఈ పాటను ప్రముఖ గాయనీ శ్రేయ ఘోషల్ పాడారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గతంలోనూ కలెక్టర్ పమేలా సత్పతి పిల్లల కోసం ఏబీసీడీలతో పాట పాడిన విషయం తెలిసిందే. అంగన్ వాడీల బలోపేతంలో భాగంగా వారికి టీచర్‌గా మారిన పమేలా సత్పతి ‘ఏ అంటే ఆపిల్, బీ అంటే బాల్’ కు బదులుగా.. ‘ఏ ఫర్ యాక్టివ్.. బీ ఫర్ బ్రైట్.. సీ ఫర్ క్రియేటివ్’ అంటూ ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్‌కు సరికొత్త పదాలతో పాడారు.
Also Read: ఇజ్రాయిల్ అంతు చూసేందుకు.. ఇరాన్ వద్ద ఉన్న 5 పవర్ ఫుల్ వెపన్స్ ఇవే!
ఆమె మాతృభాష ఒడియా అయిన హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతారు. తెలుగు రాయగలరు, చదవగలరు.అంతేకాదు. భద్రాచలంలో పనిచేసే సమయంలో అక్కడ గిరిజనుల బాధలు వారి నోట నుంచి తెలుసుకునేందుకు కోయ భాష నేర్చుకున్నారు పమేలా. అంతేకాదు...కోయ భాషలో పాటలు రాసే స్థానిక రచయితలను పోత్సహించి ఎన్నో ఆల్బమ్‌లు రూపొందించి విడుదల చేయించారు. కరీంనగర్‌కు వచ్చాక ఆమెకు ఉర్దూ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది. అనుకున్నదే తడవుగా ట్యూటర్‌ను వెదికారు. ఉర్దూలో అక్షరాలు నేర్చుకుని బేసిక్ కోర్సు పూర్తి చేశారు.‘మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ’ నుంచి ఉర్దూలో డిప్లమా చేశారు. భవిష్యత్‌లో మరిన్ని కోర్సులు చేసి ఉర్దూలో ప్రావీణ్యాన్ని సాధించాలనుకుంటున్నారు.
Also Read: మణిపూర్ వెపన్స్ ఆఫరేషన్..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం
Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?