సచివాలయంలో బెటాలియన్ పోలీసులు ఔట్.. బాధ్యతలు స్వీకరించిన టీజీఎస్పీఎఫ్

తెలంగాణ సచివాలయం వద్ద ఉంటున్న బెటాలియన్ కానిస్టేబుళ్లను ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (TGSPF) భద్రత బాధ్యతలను స్వీకరించింది. మొత్తం 214 మంది ఈరోజు నుంచి సచివాలయం విధులు నిర్వహంచనున్నారు.

New Update
Secrartariate

తెలంగాణ సచివాలయం వద్ద ఉంటున్న బెటాలియన్ కానిస్టేబుళ్లను ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (TGSPF) భద్రత బాధ్యతలను స్వీకరించింది. మొత్తం 214 మంది ఈరోజు నుంచి సచివాలయం విధులు నిర్వహంచనున్నారు. గేట్లు, ఇతర ప్రాంతాలు, లోపల గస్తీ వంటి బాధ్యతలను రాష్ట్ర సర్కార్.. టీజీఎస్పీఎఫ్‌కు అప్పగించింది. ఎస్పీఎఫ్ కమాండెంట్ దేవీదాస్ నేతృత్వంలోని భద్రత సిబ్బంది శుక్రవారం సచివాలయం ఆవరణలో పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. 

Also Read: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన!

 వాస్తవానికి సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటగా ఎస్పీఎఫ్‌కే భద్రత బాధ్యతలు అప్పగించారు. అయితే 2023 ఏప్రిల్ 25న భద్రత నిర్వహణను తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) లేదా బెటాలియన్ పోలీసులకు అప్పగించారు. భద్రతతో పాటు అగ్నిప్రమాదాల నుంచి రక్షణ లాంటి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న ఎస్పీఎఫ్‌నకు సచివాలయంలో భద్రత బాధ్యతలు అప్పగించాలని డీజీపీ ఆగస్టు 5న రాష్ట్ర సర్కార్‌కు ప్రతిపాదన పంపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న రేవంత్ సర్కార్.. ఇకనుంచి టీజీఎస్పీ భద్రత బాధ్యతలు ఎస్పీఎఫ్‌ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.   

Also Read: తెలంగాణ మందుబాబులకు బ్యాడ్ న్యూస్‌..భారీగా ధరల పెంపు!

ఇదిలాఉండగా.. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని, ఐదేళ్ల పాటు తమను ఒకే చోట పనిచేయించాలని, ఆ తర్వాత ఏఆర్‌, సివిల్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ ఇప్పించాలని బెటాలియన్ కానిస్టేబుళ్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమను వెట్టిచాకిరి కోసం వాడుకుంటున్నారని కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో పోలీస్ ఇప్పటిదాకా 49 మందిని సస్పెండ్ చేసింది. మరోవైపు బైదరాబాద్‌లో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. మరోవైపు బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. 

Also Read: హైదరాబాద్ లో కారు బీభత్సం.. కేబీఆర్ పార్క్ దగ్గర ఏమైందంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు