Hyderabad: హైదరాబాద్ లో కారు బీభత్సం.. కేబీఆర్ పార్క్ దగ్గర ఏమైందంటే? హైదరాబాద్ లో పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు, బంజారా హిల్స్ లోని కేబీఆర్ పార్క్ గోడను అతి వేగంతో ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. ఘటన తర్వాత కారు డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. By Bhavana 01 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ లో పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు, బంజారా హిల్స్ లోని కేబీఆర్ పార్క్ గోడను అతి వేగంతో ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. ఘటన తర్వాత కారు డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి చెక్ పోస్టు వైపు పోర్షే కారు వస్తోంది. ఆ ప్రాంతం డౌన్‌గా ఉండడంతో కారు డ్రైవర్ మరింత వేగాన్ని పెంచాడు. Also Read: తెలంగాణ మందుబాబులకు బ్యాడ్ న్యూస్..భారీగా ధరల పెంపు! హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లలోని PORSCHE కారు బీభత్సంకేబీఆర్ పార్క్ ప్రహరీ గోడను డీ కొట్టిన ఎలక్ట్రిక్ కారునెంబర్ ప్లేట్ లేకుండా కారు ప్రయాణం పరారీలో డ్రైవర్కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గ్రిల్స్ ధ్వంసం చేసుకుంటూ చెట్టును ఢీకొట్టి ఆగిన కారుఎయిర్… pic.twitter.com/xbDl7om86f — ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) November 1, 2024 చిన్న టర్నింగ్ తీసుకునే క్రమంలో నేరుగా వెళ్లి కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గ్రిల్స్ ని గుద్దుకుంటూ వాటిని విరగొట్టి చెట్టును ఢీకొట్టి ఆగింది కారు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే కారుకి నెంబర్ ప్లేట్ తీసుకుని డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని, క్రేన్ సాయంతో వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. Also Read: దీపావళి వేడుకల్లో అపశృతి..సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 40 మంది పోలీసులకు సవాల్.. కారుకి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో ఈ ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. పోర్షే కారు బడాబాబులకు చెందిన వారికే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కారును డ్రైవర్‌కి ఇవ్వరని, యాక్సిడెంట్ చేసిన వ్యక్తి, నెంబర్ ప్లేట్‌ను తీసుకొని వెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఏయే ప్రాంతాల మీదుగా వచ్చింది? అనేదానిపై సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. Also Read: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్! కొంత కాలం క్రితం పూణెలో కూడా పోర్షే కారు ఘటన జరిగింది. మైనర్ బాలుడు అర్థరాత్రి చేసిన డ్రైవింగ్‌కు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలైయ్యాడు. ఆ యువకుడు రాజకీయ నేత కొడుకు కావడంతో ఆ కేసు నుంచి తప్పించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. చివరకు ఆ నేత అరెస్టయిన విషయం తెల్సిందే. Also Read: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. గంటలోగా దర్శనం..! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి