/rtv/media/media_files/2025/04/28/QBSFRSWk0UqsDQV7koVB.jpg)
Telangana High Court
TGPSC Group 1 Recruitment: తెలంగాణలో ఇటీవల గ్రూప్ 1 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని హెకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీలు దాఖలు చేసింది.
Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ
అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టు సీజే ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగ్గా చేయలేదని.. పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లో కూడా రూల్స్ పాటించలేదని పిటిషనర్లు అభ్యంతరాలు తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం.. గ్రూప్ 1 నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యేవరకు నియామకాలు చేపట్టొదని ఆదేశించారు.
Also Read: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం.. ఎవరి బలం ఎంత?
అయితే ధ్రువపత్రాలు పరిశీలన చేసుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ సీజే ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు సీజే ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేశామని టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది సింగ్ బెంచ్‌కు తెలిపారు.
Also Read: ఇండియాతో యుద్ధం వద్దు.. పాక్ మాజీ ప్రధాని కీలక సూచనలు
Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ
telugu-news | rtv-news | national-news | group-1 | high-court