/rtv/media/media_files/2025/04/11/sFz7n4vzKWovVuUIfFTn.jpg)
results
తెలంగాణ పదవ తరగతి పరీక్షల ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే పదవ తరగతి ఫలితాలను ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇచ్చేవారు. కానీ ఈ సారి మెమోలపై కీలక మార్పులు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇకపై మెమోలను సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
త్వరలోనే పరీక్షల ఫలితాలు..
తెలంగాణలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,650 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను దాదాపుగా 5 లక్షల మంది విద్యార్థులు రాసినట్లు సమాచారం. అయితే త్వరలోనే పదవ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఇది కూడా చూడండి: Pakistan-India-China: భారత్-పాక్ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!
ఇదిలా ఉండగా ఇటీవల ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మే 19 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఇది కూడా చూడండి: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!
100 శాతం ఫలితాలు సాధించిన 1680 పాఠశాలలు ఉన్నాయి. అయితే ఇందులో అబ్బాయిలు 78.31 శాతం పాస్ కాగా.. అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. కేవలం వెబ్‌సైట్ మాత్రమే కాకుండా వాట్సాప్ నంబర్ 9552300009 కు హాయ్ అని మెసేజ్ చేసి కూడా ఫలితాలు తెలుసుకున్నారు.
ఇది కూడా చూడండి: KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. దద్దరిల్లిన కేసీఆర్ ప్రసంగం
results | tenth | 10th-results | memo