Good News: అంగన్వాడి టీచర్లు, ఉపాధి హామీ సిబ్బందికి గుడ్ న్యూస్ !

మినీ అంగన్వాడి టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 3989 మందిని మెయిన్ అంగన్వాడి టీచర్లుగా ప్రమోట్ చేసినట్లు ప్రకటించింది. అలాగే ఉపాధి హామీ సిబ్బందికి నాలుగు నెల‌ల వేతనాలు రూ.62 కోట్లు ప్రభుత్వం విడుద‌ల చేసింది.

New Update
tg ang upd

TG Government good news to mini Anganwadi teachers, field assistants

Good News: మినీ అంగన్వాడి టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 3989 మందిని మెయిన్ అంగన్వాడి టీచర్లుగా ప్రమోట్ చేసినట్లు ప్రకటించింది. అలాగే ఉపాధి హామీ సిబ్బందికి నాలుగు నెల‌ల వేతనాలు రూ.62 కోట్లు ప్రభుత్వం విడుద‌ల చేసింది.

న్యాయపరమైన చిక్కులే కారణం..

ఈ మేరకు మినీ అంగన్వాడీ టీచర్లు ఇకపై మెయిన్ అంగన్వాడీ టీచర్ల మాదిరిగానే వేతనం అందుకోనున్నట్లు తెలిపింది. మినీ, మెయిన్ తేడా లేకుండా ఇక పై అందరూ అంగన్వాడి టీచర్లేనని స్పష్టం చేసింది. సాంకేతిక సమస్యలు, న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇంత కాలం ఆలస్యం చేసినట్లు పేర్కొంది. 

ఇది కూడా చదవండి: ఆ వ్యాధులు ఉన్నవారు పుచ్చకాయ తింటే డేంజర్.. ఈ విషయాలు మీకు తెలుసా?

ఈ నెలలోనే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి.  ఏప్రిల్ నుంచి క్రమం తప్పకుండా మినీ అంగన్వాడీ టీచర్లకూ నెలకు రూ.13,650 జీతం అందుతుంది. గతంలో మినీ అంగన్వాడీ టీచర్లకు నెల జీతం రూ. 7800 ఉంది. ఇందులో ఎలాంటి చిక్కులు లేకుండా, సమస్యను పరిష్కరించి, ప్రతి నెలా వేతనాలను అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఇందుకుగాను సీతక్కకు అంగన్వాడీలు కృతజ్ఞతలు తెలిపారు. 

ఇది కూడా చదవండి: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!

మరోవైపు ఉపాధి హ‌మీ సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 4 నెల‌ల వేతనాల‌ను విడుద‌ల చేసింది. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నిక‌ల్ అసిస్టెంట్లు, ఏపీవోల‌తో స‌హ మొత్తం 3200 మందికి పైగా సిబ్బందికి రూ.62 కోట్లను రిలీజ్ చేసింది. ఇప్పటికే ప‌లువురు ఖ‌తాల్లో జ‌మ అయ్యాయని, రెండు రోజుల్లో అందరికీ జీతాలు అంద‌నున్నట్లు వెల్లడించింది. 

anganvaadi | Upadi Hami Pathakam Payments | today telugu news

Advertisment
Advertisment
తాజా కథనాలు