TET: టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. ఇదిగో లింక్

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2025) హాల్‌టికెట్లు రిలీజయ్యాయి. జూన్ 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం సాయంత్రం టెట్‌ హాల్‌టికెట్లను విడుదల చేశారు.

New Update
TET Hall Tickets

TET Hall Tickets

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2025) హాల్‌టికెట్లు రిలీజయ్యాయి. జూన్ 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం సాయంత్రం టెట్‌ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. డౌన్‌లోడ్‌ కోసం ఈ లింక్‌పై https://tgtet.aptonline.in/tgtet/HallticketFrontక్లిక్ చేయండి. అభ్యర్థులు జర్నల్ నెబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఇది కూడా చదవండి: ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..? ఓ అధ్యయనంలో చెప్పిన షాకింగ్ నిజాలు..!!

టెట్‌ పరీక్షలు నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి.  ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్‌ అప్లికేషన్లు స్వీకరించిన సంగతి తెలిసిందే. మొత్తం 1.83 లక్షల మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు. పేపర్‌ 1కు పేపర్‌ 1కు 63,261మంది, పేపర్‌-2కు 1,20,392మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక రెండు పేపర్లకు15వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. 

ఇది కూడా చదవండి: మునగ నీటితో అద్భుత లాభాలు.. డయాబెటిక్ రోగులకు బెస్ట్‌ కషాయం..!!

Advertisment
తాజా కథనాలు