/rtv/media/media_files/2024/12/06/lcl4DNabac1LlboUwPop.jpg)
తెలంగాణ సర్కార్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కీలక మార్పులు చేయాలని యోచిస్తోంది. పదో తరగతి పరీక్షలు సెమిస్టర్ విధానంలో నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. అకాడమిక్ ఈయర్ మొత్తం చదివి ఒకేసారి పరీక్షలు రాయాలంటే విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, పిల్లలపై ఒత్తిడి తగ్గించడానికి అకాడిక్ ఈయర్ లో రెండు సార్లు సెమిస్టర్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
ఇది కూడా చదవండి : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు కోర్సులు
ఇది కూడా చదవండి : ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం
సెమిస్టర్ సిస్టమ్ విధానం అమలుపై ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, స్టూడెంట్స్, పిల్లల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయం సేకరించనుంది. డిసెంబర్ 2న విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఖమ్మం జిల్లా కుసుమంచి, జీళ్ల చెరువు హైస్కూల్స్ సందర్శించినప్పుడు ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
సీబీఎస్ విధానంలో కూడా ఈయర్లీ రెండు సెమిస్టర్ రూపంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తు్న్నారు. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని తీసుకువచ్చేందుకు యోచిస్తున్నది. ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నది.
ఇది కూడా చదవండి : Breaking: హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఒకరికి గాయాలు
దీనిపై నిపుణుల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. ఇంటర్, టెన్త్ మినహా తెలంగాణలో డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ సెమిస్టర్ విధానంలోనే కండక్ట్ చేస్తున్నారు. ఇక ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టకల్ మార్కులు పెంచాలని వాదన కూడా నడుస్తోంది.