/rtv/media/media_files/2024/12/06/NXE2Ru05bNXB8OjlwegW.jpg)
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. మొబైల్ యాప్ ను ఆవిష్కరించటంతో పాటు ఇంటి నమూనాను కూడా విడుదల చేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిసెంబర్ 5న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాప్ ను విడుదల చేశారు. ఇంటి నమూనాలతో పాటు యాప్ పని తీరును పరిశీలించారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆధునిక టెక్నాలజీతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు మరో వెసులుబాటును కూడా సర్కార్ కల్పించింది. ప్రభుత్వం అందించే 400 చదరపు అడుగుల డిజైన్ ను అనుసరించాల్సిన పని లేదు. ఇంకా స్థలం కలిగి ఉంటే 500 చదరపు అడుగుల్లోనూ ఇల్లు కట్టుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అందుకు సంబంధించి మూడు నమోనాలను తయారు చేశారు. అవి
ఈ మోడల్ లో రెండు బెడ్ రూమ్ లు, ఓ కిచెన్, హాల్ ఉంటుంది.10, 13 అడుగుల మాస్టర్ బెడ్ రూమ్, 9, 9.8 అడుగులతో మరో బెడ్ రూమ్ ఉంటుంది. 10, 8 అడుగుల కొలతల్లో కిచెన్ నిర్మించుకోవచ్చు. 500 చదరపు అడుగుల్లో ఈ ఇల్లు డిజైన్ చేశారు. ఇందులో అటాచ్డ్ బాత్ రూం లేదు.
సింగల్ బెడ్ రూంతో మరో రెండు మోడల్స్ తయారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇవి 400 చదరపు అడుగుల్లో నిర్మించుకోవచ్చు. ఓ బెడ్ రూమ్, కిచెన్, హాల్ కలిగి ఉంది ఈ రెండూ మోడల్స్. వీటికి అటాచ్డ్ బాత్ రూమ్ ఉన్నాయి. హాల్, బెడ్ రూమ్ సైజ్ పెంచి.. ఇందులో కిచెన్ సైజ్ తగ్గించారు. లబ్ధిదారులు వారికున్న ప్లేస్ లో ఈ మూడు డిజైన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ ఏడాదిలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను దశల వారీగా ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా డిసెంబర్ 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమౌతుంది.