/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ugc-jpg.webp)
ఇప్పటి వరకు మన దేశంలో ఏదైనా ఒక కోర్సును మాత్రమే చదవచ్చు. కానీ నూతన విద్యా విధానం అమల్లోకి వస్తే మాత్రం ఒకేసారి రెండు కోర్సుల్లో జాయిన కావచ్చు. అలాగే పీజీ, డిగ్రీ కోర్సులో విద్యార్థులు ప్రతీ ఏడాది కూడా రెండుసార్లు జాయిన్ కావచ్చు. ఈ మార్పులకు యూజీసీ కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
6 central universities to offer admissions twice a year, as per UGC policyhttps://t.co/KACDneXdJt
— Mamidala Jagadesh Kumar (@mamidala90) December 5, 2024
ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్.. దర్శనానికి ప్రత్యేక పోర్టల్
అభ్యంతరాలు ఉంటే..
ఈ కొత్త విద్యా విధానంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23లోగా సూచనలు, అభ్యంతరాలు పంపవచ్చు. ఆ తర్వాత యూజీసీ గెజిట్ జారీ చేస్తే.. కొత్త రూల్ అన్ని కోర్సులకు వరిస్తుంది. కానీ ఈ కొత్త విధానాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు అమలు చేస్తాయో లేదో అనేది కన్ఫార్మ్ తెలియదు.
Revolutionizing higher education: UGC proposes biannual admissions and more flexibility
— UGC INDIA (@ugc_india) December 5, 2024
Read more: https://t.co/Uq7Oi34jMR
Courtesy: @SundayGuardian
ఇది కూడా చూడండి: రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. ఎక్కడంటే?
ఏదైనా డిగ్రీ లేదా పీజీ కోర్సులో జాయిన్ కావాలంటే ఏడాదికి ఒక్కసారి మాత్రమే అవుతుంది. అదే కొత్త విధానం అమల్లోకి వస్తే ఏటా రెండు సార్లు ప్రవేశాలు కల్పిస్తారు. జులై-ఆగస్టుతో పాటు జనవరి-ఫిబ్రవరిలో కూడా ప్రవేశాలు జరుగుతాయి. ఒకేసారి రెండు డిగ్రీ లేదా పీజీ కోర్సులను చదువుకోవచ్చు.
UG, PG aspirants can soon seek admission in any discipline irrespective of subject previously studied https://t.co/G7HSWfm6iv
— Mamidala Jagadesh Kumar (@mamidala90) December 5, 2024
ఇది కూడా చూడండి: నేటి నుంచే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
ఇప్పటి వరకు ఏ గ్రూప్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్‌లు మాత్రమే చదవాలి. కానీ ఇకపై ఏ గ్రూప్ తీసిన కూడా నచ్చిన సబ్జెక్ట్‌లు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు మీరు బీఎస్సీ అయితే బీఏలో కూడా కొన్ని సబ్జెక్ట్‌లు చదవచ్చు. వీటితో పీజీలో కూడా చేరవచ్చు. డిగ్రీతో సంబంధం లేకుండా మీకు నచ్చిన కోర్సులో పీజీలో చేరవచ్చు. అలాగే క్లాస్‌లను హైబ్రిడ్ విధానంలో భోదించనున్నారు.
ఇది కూడా చూడండి: కాంగ్రెస్ పాలనలో చావులు, కన్నీళ్లే.. బండి సంచలన వ్యాఖ్యలు