Liquor: భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతున్న లిక్కర్.. 63 శాతం దీనివల్లే!

సీడీఈడబ్ల్యూకి 63.2 శాతం మంది భార్యలు మద్యం కారణంగానే భర్తలపై ఫిర్యాదులు చేస్తున్నారని మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ ఇటీవల తెలిపారు. ఈ ఏడాది సీడీఈడబ్ల్యూకి మొత్తం 9వేల ఫిర్యాదులు రాగా అందులో 8200 మంది మహిళలకు లబ్ధి చేకూరిందని శిఖా గోయల్ అన్నారు.

New Update
liquor

ప్రస్తుతం జనరేషన్‌లో పెళ్లయిన కొన్నాళ్లకే భార్యాభర్తలు విడిపోతున్నారు. వ్యక్తిగత కారణాలు, ఆర్థిక సమస్యలు, అక్రమ సంబంధాలు, అనుమానం ఇలా ఎన్నో కారణాలతో దాంపత్య బంధానికి వీడ్కోలు పలుకుతున్నారు. అయితే భార్యాభర్తల మధ్య ఎక్కువ శాతం గొడవలు లిక్కర్ వల్లే జరుగుతున్నాయని మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ ఇటీవల తెలిపారు. 

ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

కౌన్సిలింగ్ ఇస్తే కాపురాలు నిలుస్తాయని..

మహిళల పోలీసు స్టేషన్‌కి వెళ్లి కేసు నమోదు చేసి పెద్దది చేసుకోవడం కంటే.. ముందే వారి సమస్యలకు పరిష్కారం చూపించాలని మహిళా సాధికారత అభివృద్ధి కేంద్రం(సీడీఈడబ్ల్యూ)లను ఏర్పాటు చేశారు. వీటివల్ల భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తే కాపురాలు నిలుస్తాయని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ సీడీఈడబ్ల్యూలు ఏర్పాటు చేశారు. 

ఇది కూడా చూడండి:  బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

మహిళా సాధికారత అభివృద్ధి కేంద్రాలకు వస్తున్న ఫిర్యాదులను విశ్లేషించి ఆమె తెలిపారు. మహిళా సాధికారత అభివృద్ధి కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 50 వేల మంది మహిళలు లబ్ధి పొందారట. తెలంగాణలో ఈ ఏడాది మొత్తం 9 వేల ఫిర్యాదులు వచ్చాయట. ఈ మొత్తం ఫిర్యాదుల్లో 30 వేల కౌన్సిలింగ్‌లు నిర్వహించి 8200 మంది భార్యాభర్తల మధ్య గొడవలను క్లియర్ చేసి మళ్లీ కలిపారు.

ఇది కూడా చూడండి: Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

దీనివల్ల చాలా మంది మహిళల కాపురాలు నిలిచాయని ఇప్పుడు వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు.ఈ విభాగంలో వచ్చిన ఫిర్యాదుల్లో 63.2 శాతం మంది మహిళలు భర్తలపై మద్యం విషయంలోనే ఫిర్యాదు చేశారు. మిగతా కేసులు ఆర్థిక సమస్యలు, అనుమానం, అక్రమ సంబంధాల వల్ల వస్తున్నాయని తెలిపారు. 42 శాతం దంపతలు మధ్య పెళ్లయిన ఐదేళ్లలోనే వివాదాలు జరుగుతున్నాయని తెలిపారు. 

ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు