తెలంగాణ టెట్‌ షెడ్యూల్‌ రిలీజ్.. పూర్తి వివరాలివే!

తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్ అయింది. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి 11.30 గంటల వరకు.. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. డిసెంబర్ 26న హాల్‌టికెట్లు విడుదల కానున్నాయి.

New Update
tg tet 2024

తెలంగాణ టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. తాజాగా టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సబ్జెక్టుల వారీగా విద్యాశాఖ తెలంగాణ టెట్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు రెండు సెషన్లలో ఉంటాయి. ఉదయం 9గంటల నుంచి 11.30 గంటల వరకు.. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఇది కూడా చూడండి:లెస్బియన్స్‌తో సహజీవనం చట్టబద్ధమే.. హైకోర్టు సంచలన తీర్పు

ఈ తేదీల్లో పరీక్షలు

అలాగే ఏ ఏ తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారో కూడా విద్యాశాఖ తెలిపింది. టెట్ పేపర్ 1 పరీక్షలను జనవరి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే పేపర్ 2 పరీక్షలను జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. 

ఇది కూడా చూడండి:  ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ

అయితే ఈ సారి టెట్ పేపర్ 1, పేపర్‌ 2కి కలిపి దాదాపు 2.48 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబర్ 26న విడుదల చేయనున్నారు. ఈ పరీక్షల అనంతరం ప్రిలిమినరీ కీ, ఫైనల్ కీని విడుదల చేస్తారు. ఆపై ఫిబ్రవరి 5న టెట్ ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. 

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

ఇది కూడా చూడండి: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్

Advertisment
Advertisment
తాజా కథనాలు