Telangana: ఛీ ఛీ.. ఇలాంటి ఫుడ్ ఎవడన్నా తింటాడా..? చూస్తే వాంతులే.. తెలంగాణాలో హోటల్లో బాగోతాలు!

హైదరాబాద్‌లో పలు హోటళ్లను ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. హిమాయత్‌నగర్‌లోని హోటల్ తులిప్స్‌ గ్రాండ్‌‌లో కుళ్లిపోయిన మాంసం గుర్తించారు. మాదాపూర్‌ కావూరీ‌హిల్స్‌లో క్షత్రియ ఫుడ్స్‌ సైతం అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు.

New Update
telangana Task force team conducted inspections

telangana Task force team conducted inspections

ఏంటీ ఘోరం.. కనీసం మంచి భోజనం కూడా తినలేని స్థితిలో ఉన్నామా?.. ఎందుకిలా జరుగుతోంది?.. దీనికి కారకులు ఎవరు?.. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. హోటల్ యాజమాన్యంలో మార్పులు ఎందుకు రావడం లేదు?.. అనే పరిపరి విధాల ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. అందుకు కారణం.. హోటల్‌లో అపరిశుభ్రత, కుళ్లిపోయిన మాంసాలు, పాడైపోయిన పదార్థాలే. హోటళ్లలో భోజనం చేయాలంటేనే వణికిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు వాపోతున్నారు. 

Also Read: హైదరాబాద్‌లో తక్కువ ధరకే మేక, గొర్రె మాంసం...ఇది తింటే ఇక బతికినట్టే..

ఎంతో ప్రసిద్ధిగాంచిన హోటళ్లు, పేరు మోసిన రెస్టారెంట్లు సైతం తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అలాంటి హోటల్‌ కూడా అపరిశుభ్రంగా.. ఎలాంటి క్లీనింగ్ లేకుండా అధికారుల తనిఖీల్లో బయటపడింది. నిన్న హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న సుబ్బయ్యగారి హోటల్‌లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా.. అపరిశుభ్రంగా ఉన్న వంటగదులు, పాడైపోయిన కూరగాయలు, డేట్ అయిపోయిన పిండి పదార్థాలను గుర్తించారు. 

హోటల్ తులిప్స్ గ్రాండ్

ఇది మరువక ముందే మరి కొన్ని ప్రాంతాల్లో ఉన్న హోటల్, రెస్టారెంట్ల బండారాన్ని అధికారులు బట్టబయలు చేశారు. తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగారెడ్డి జిల్లా హిమాయత్‌నగర్‌లోని తుర్కయాంజల్‌లో ఉన్న హోటల్ తులిప్స్‌ గ్రాండ్‌లో తనిఖీలు చేపట్టారు. అందులో వంటగది అత్యంత అపరిశుభ్రంగా ఉందని వారు గుర్తించారు. 

వంట చేసే ప్రాంతం, అలాగే కూరగాయలు, ఇతర పదార్థాలు నిల్వ చేసే దగ్గర చాలా అపరిశుభ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా స్టోర్ రూమ్‌లో సైతం పూర్తిగా కుళ్ళిపోయిన 96 కిలోల మాంసం, కీటకాలు సోకిన రూ.2,500 విలువైన ఐస్‌క్రీమ్‌లు, డేట్ అయిపోయిన పుట్టగొడుగులు నిల్వలున్నట్లు తెలిపారు. వంటచేసే దగ్గరే ఒక చెత్తబుట్ట తెరిచి ఉంచిన విజువల్స్ బయటపెట్టారు.

Also Read: బెట్టింగ్ యాప్ వివాదం.. రానా, దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో పాటు వారందరిపై కేసులు

అలాగే వంటగదిలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేనట్లు గుర్తించారు. మరీ ముఖ్యంగా వంట కోసం పదేపదే నూనెను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అది మాత్రమే కాకుండా పనిచేసే సిబ్బందికి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవని వారు చెప్పారు. 

మాదాపూర్‌లో దారుణం

దీంతోపాటు మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో ఉన్న క్షత్రియ ఫుడ్స్‌లో కూడా తనిఖీలు చేపట్టారు. అందులో  ఫ్లోరింగ్ మొత్తం మురికిగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా విరిగిపోయిన టైల్స్‌‌తో వంటగది చిందరవందరగా ఉన్నట్లు తెలిపారు. చిమ్నీలు నూనె/గ్రీజు కిందకి కారుతూ జిడ్డుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందులోని డ్రైనేజీ వ్యవస్థ ఆహార వ్యర్థాలతో మూసుకుపోయినట్లు గుర్తించారు. కూరగాయలు కోసే ప్రదేశంలో ఈగలు, దోమలు అధిక సంఖ్యలో కనిపించాయని తెలిపారు. 

అలాగే సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగించబడుతున్నట్లు గుర్తించారు. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్స్ కలిపి నిల్వ చేసినట్లు తెలిపారు. అలాగే హోటల్ సిబ్బంది ఎలాంటి హెడ్‌క్యాప్‌లు, గ్లౌజులు లేకుండా ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్‌లో ప్లాస్టిక్ కవర్లలో లేబుల్ లేకుండా నిల్వ చేసిన మాంసం కనుగొన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు