బెట్టింగ్ యాప్ వివాదం.. రానా, దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో పాటు వారందరిపై కేసులు

బెట్టింగ్ యాప్ కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్ పోలీసులు టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, అన్యన్య, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, శ్రీముఖి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

New Update
Betting App case

Betting App case Photograph: (Betting App case)

బెట్టింగ్ యాప్ కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్ పోలీసులు టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, అన్యన్య, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, ప్రణీత, యాంకర్ శ్యామల తదితరులపై పోలీసుల కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమెట్ చేసినందుకు మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు బుల్లితెర నటులు శోభాశెట్టి, సిరి హనుమంతు, నయని పావని, శ్రీముఖి, విష్ణుప్రియ, రీతూ చౌదరి, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్‌పై కూడా ఉన్నారు. 

ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ

ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు

విచారణకు హాజరైన విష్ణుప్రియ..

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు ఇది వరకే పంజాగుట్ట పోలీసులు ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. యాంకర్ విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరి, సుప్రీత,శ్యామలపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నేడు విష్ణుప్రియ తన లాయర్‌తో  కలిసి విచారణకు కూడా వెళ్లింది. 

ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...

ఇదిలా ఉండగా బెట్టింగ్ యాప్‌లపై సజ్జనార్ ఉక్కుపాదం మోపుతున్నారు. వెండితెర, బుల్లితెర అని లేకుండా అందరిపై కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడంతో పాటు కెరీర్ అన్ని కూడా పోగోట్టుకుంటున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరెవరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల చనిపోయారో తెలితే.. తప్పకుండా వారికి 10 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు