ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే.. నేటి నుంచి ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రజలందరు సులభంగా సేవలు పొందేందుకు ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల సర్వేను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ కార్డుల సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సికింద్రాబాద్‌లో హాకీ మైదానంలో ప్రారంభించనున్నారు.

CM Revanth Reddy
New Update

తెలంగాణ ప్రభుత్వం ఒక రాష్ట్రం.. ఒకే గుర్తింపు కార్డు జారీకి ఏర్పాట్లు చేయనుంది. ప్రజలు సులభంగా, తొందరగా రాష్ట్రంలో ఎక్కడైనా సేవలు పొందేందుకు ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ గుర్తింపు కార్డుల సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సికింద్రాబాద్ హాకీ మైదానంలో ప్రారంభించనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలతో పాటు మిగతా వాటి అమలు పని చేసే విధంగా డిజిటల్ కార్డులు ఉంటాయి. కుటుంబ కార్డులు తరహాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ఇవ్వనున్నారు. ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు నంబర్ ఉంటుంది. అలాగే కుటుంబంలోని సభ్యులకు వ్యక్తిగత నంబర్లు కూడా ఉంటాయి. కుటుంబ వివరాలు అన్ని జాగ్రత్తగా సేకరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: ఉదయాన్నే ఈ పదార్థాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ప్రజలకు ఉపయోగపడే విధంగా..

ఇప్పటికే అమలు అవుతున్న మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హరియాణా రాష్ట్రాల్లో డిజిటల్‌ కార్డుల విధానాన్ని అధికారులు పరిశీలించారు. అన్నింటిని అధ్యయనం చేసిన తర్వాత ప్రజలకు ఉపయోగపడేలా మార్పులు చేస్తూ కొత్తగా అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే ప్రస్తుతానికి వైద్యారోగ్య, పౌరసరఫరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు కార్డులు అందించాలని నిర్ణయించారు. కానీ ఇంకా ఇతర సేవలనూ కూడా కలపాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా 119 పట్టణాలు, 119 గ్రామాల్లో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు అందించనున్నారు. ఆరోగ్య శ్రీ కార్డుల స్థానంలో  వీటిని రిప్లేస్ చేయనుంది. ఈ డిజిటల్ కార్డుల సర్వేలో పర్యవేక్షణ కోసం కొందరు స్పెషల్ ఆఫీసర్లను కూడా ప్రభుత్వం నియమించింది. 

ఇది కూడా చూడండి: ఓటీటీలో దళపతి విజయ్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

#revanth-reddy #family #telangana-government #digital-card
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe