ఉదయాన్నే ఈ పదార్థాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ఉదయంపూట అల్పహారంగా పండ్ల రసాలు, అరటి పండ్లు, వేయించిన, సిట్రిక్ ఆమ్లం, స్వీట్లు, చక్కెర పానీయాలను తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారంగా కాకుండా ఏదైనా పదార్థాలు తిన్న తర్వాత తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

author-image
By Kusuma
New Update
foods

ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వర్క్ బిజీలో ఉండి కొందరు ఉదయం పూట ఆహారం తీసుకోరు. దీనివల్ల రోజంతా చిరాకు, నిరసంగా ఉంటుంది. అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటారు. ఇవి శరీరంపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. మరి ఉదయం పూట ఖాళీ కడుపుతో తినకూడని ఆహార పదార్థాలేంటో మరి చూద్దాం. 

పండ్ల రసాలు

పండ్ల రసాలను ఉదయాన్నే తీసుకోకూడదు. వీటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. పండ్లలోని పీచు అంతా బయటకు వెళ్లిపోవడంతో జ్యూస్‌లో ఫైబర్ లేకపోవడం వల్ల ఆకలి తగ్గుతుంది.

అరటిపండు

ఉదయం ఖాళీ కడుపుతో అరటి పండ్లు తినడం వల్ల ఇందులోని పోషకాలు శరీరంలోకి చేరిన తర్వాత పెరుగుతాయి. దీనవల్ల హృదయ స్పందన రేటులో మార్పులు వస్తాయి. ఏదైనా పదార్థం తిన్న తర్వాత అరటి పండు తినడం మేలు.

వేయించిన, సిట్రిక్ ఆమ్ల పదార్థాలు

పరగడుపున బాగా వేయించిన వంటకాలు టిఫిన్‌గా తింటే.. వాంతులు, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. అలాగే సిట్రిక్ ఆమ్లం ఉండే పదార్థాలను కూడా తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. పుల్లటి పదార్థాల వల్ల బాడీలోకి చెడు బ్యాక్టీరియా వెళ్తుంది. 

స్వీట్లు, చక్కెర పదార్థాలు

స్వీట్ల, చక్కెర పానీయాలను ఉదయాన్నే తినకూడదు. వీటిని ఉదయం పూట తినడం వల్ల అజీర్ణం, వాంతులు వంటివి వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read :  ఇజ్రాయెల్‌ -ఇరాన్‌ వివాదం పై జీ 7 అత్యవసర సమావేశం!

Advertisment