Maharashtra : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంట‌ర్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అభివక్ష్మిఋద్ధిని చూసి హర్షించలేకపోతున్నారు అంటూ మండిపడ్డారు. బీజేపీ చేస్తేనే అభివృద్ధా..కాంగ్రెస్ చేస్తే కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

New Update
palamuru revanth

Telangana Cm Revanth Reddy: 

కాంగ్రెస్ మోడ‌ల్ దేశానికి తెలిస్తే గుజ‌రాత్ మోడ‌ల్ విఫ‌ల‌మ‌వుతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 50 వేల మందిని త‌ర‌లించిన‌ గుజ‌రాత్‌లో స‌బ‌ర్మ‌తీ రివ‌ర్ ఫ్రంట్‌కు చ‌ప్ప‌ట్లు కొట్టి అభినందించిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తెలంగాణ‌లో మాత్రం మూసీ పున‌రుజ్జీవ‌న కార్య‌క్ర‌మాన్ని వ్య‌తిరేకిస్తున్నారని ముఖ్య‌మంత్రి మండిప‌డ్డారు. కిష‌న్ రెడ్డి గుజ‌రాత్‌కు గులాంగా మారార‌ని...మ‌హారాష్ట్రకు ఏక్ నాథ్ శిందే, అజిత్ ప‌వార్ ఎలా విరోధులుగా మారారో కిష‌న్ రెడ్డి తెలంగాణ‌లో అలా త‌యార‌య్యార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.. గంగా న‌ది ప్ర‌క్షాళ‌న‌, స‌బ‌ర్మ‌తీ రివ‌ర్ ఫ్రంట్ కిష‌న్ రెడ్డికి గొప్ప‌గా క‌నిపిస్తోంద‌ని.. అదే వ్య‌క్తి మూసీ పున‌రుజ్జీవ‌నాన్ని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు..బీజేపీ నేత‌లు ఏం చేసినా తాము మూసీ పున‌రుజ్జీవ‌నాన్ని పూర్తి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు.

Also Read: TS: లగచర్లకు ఎస్టీ కమిషన్..

Also Read: ఉన్నత పాఠశాలల సమయం గంట పెంపు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు