Dogs: తెలంగాణలో ఘోరం.. ఊర్లో కుక్కలను టార్చర్ చేసి చంపిన గ్రామస్థులు!

తెలంగాణ సంగారెడ్డిలో దారుణం జరిగింది. ఎద్దుమైలారం గ్రామంలో నోళ్లు, కాళ్లు కట్టేసి 32 కుక్కలను 40 అడుగుల వంతెనపై నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కిందపడేశారు. 21 కుక్కలు చనిపోగా మరో 11 కుక్కల పరిస్థితి విషమంగా ఉంది.

New Update
dogs killed

21 Dogs killed in Sangareddy

Dogs Killed: మనిషి కృరమృగానికంటే దారుణంగా తయారవుతున్నాడు. మనుషుల పట్లనే కాదు మూగ జీవాల పట్ల కూడా అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నాడు. తమ పైచాచికత్వం కోసం విచక్షణ మరిచి సమాజం సిగ్గుపడే ఘటనలకు పాల్పడుతున్నాడు. భూమి మీద బతికే హక్కు తనదే అన్నట్లు వెర్రివెతలు వేస్తూ ఇతర ప్రాణులను హరిస్తున్నాడు. ఇలాంటిదే ఓ భయంకరమైన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. కుక్కలను కాళ్లు, నోరు కట్టి భారీ ఎత్తైన వంతెన నుంచి కింద పడేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం గ్రామంలో చోటుచేసుకుంది. 

భయంకరమైన దృశ్యాలు వెలుగులోకి..

ఈ మేరకు పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డిలోని ఎద్దుమైలారం గ్రామంలో 40 అడుగుల ఎత్తైన వంతెనపై నుంచి గుర్తు తెలియని వ్యక్తులు 32 కుక్కల కాళ్లు, నోళ్లను కట్టివేసి చంపిన ఘటన కలకలం రేపుతోంది. జనవరి మొదటివారంలో జరిగిన ఈ ఘటనలో 21 కుక్కలు చనిపోగా మరో 11 కుక్కల పరిస్థితి విషమంగా ఉంది. జనవరి 4వ తేదీన ఈ ఘటనపై స్థానికులు సిటిజన్స్ ఫర్ యానిమల్స్ కు సమాచారం అందించగా ఈ భయంకరమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని కుళ్ళిపోతున్న కళేబరాలతోపాటు మరికొన్ని గాయపడిన కుక్కలను కనుగొన్నారు.

ఇది కూడా చదవండి: Nallamala: నల్లమలలో 27 కి.మీ. భూగర్భ సొరంగం.. 17 వేల ఎకరాల భూమి..!

జంతు సంరక్షణ సంఘాల ఆందోళన..

ఇక డంపింగ్ ప్రదేశంలో నీరు నిలిచిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ సవాలుగా మారింది. యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ, పీపుల్ ఫర్ యానిమల్స్ హైదరాబాద్ సహకారంతో గాయపడిన 11 కుక్కలను వెలికితీసి వైద్య సంరక్షణ కోసం నాగోల్‌లోని షెల్టర్‌కు తరలించారు.జంతు సంరక్షణ సంఘాలు ఈ దారుణ ఘటనను ఖండించాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి జంతు హింస కేసులు పెరిగిపోతున్నాయని, మానవులపై జరుగుతున్న నేరాల మాదిరిగానే అధికారులు వీటిని కూడా సీరియస్‌గా పరిష్కరించాలని వాలంటీర్ పృథ్వీ పనేరు అన్నారు.

ఇది కూడా చదవండి: Tiger: మనసు మార్చుకున్న పులి.. మనిషిని చూస్తే జంకుతుందట!

సిటిజన్స్ ఫర్ యానిమల్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంద్రకరణ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. కాళ్లు, నోరు కట్టి కుక్కలను ఉద్దేశపూర్వకంగా వంతెనపై నుండి విసిరివేసినట్లు ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. చనిపోయిన కుక్కల పోస్ట్‌మార్టం నివేదికలతో సహా ఆధారాలను సేకరిస్తున్న అధికారులు దీనిపై చుట్టుపక్కల నివాసితులను ప్రశ్నిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు