Gaddar: గద్దరన్న బిడ్డకు రేవంత్ సర్కార్ కీలక పదవి..

గద్దర్ కూతురు వెన్నెలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆమెను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా నియమించింది. యువజన పురోగతి, పర్యాటన, సంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Gaddar Revanth reddy Vennela
New Update

గద్దర్ కూతురు వెన్నెలకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా ఆమెను నియమించింది. యువజన పురోగతి, పర్యాటన, సంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుటుంబానికి సముచిత స్థానం ఇవ్వాలన్న ఆలోచనతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు అందించే నంది అవార్డ్స్ ను గద్దర్ అవార్డ్స్ గా మార్చింది రేవంత్ సర్కార్. ఈ పేరుతోనే ఇక నంది అవార్డ్స్ ను అందించనున్నట్లు ప్రకటించింది. గద్దర్ జయంతి వేడుకలను సైతం అధికారికంగా నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్. తాజాగా గద్దర్ కూతురుకు కేబినెట్ ర్యాంక్ కలిగిన తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ పదవిని ఇచ్చింది.

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు

ఇది కూడా చూడండి:  ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!

కంటోన్మెంట్ నుంచి ఎన్నికల బరిలోకి.. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నెలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించింది కాంగ్రెస్. అయితే.. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.అయితే.. ఎన్నికలు జరిగిన కొన్ని నెలలకే ఓ రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందారు. దీంతో వచ్చిన ఉప ఎన్నికల్లో వెన్నెలకు అవకాశం ఇవ్వలేదు. బీజేపీ నుంచి చేరిన శ్రీగణేశ్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలోకి దించారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు.

ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్.. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇందుకోసం సంస్కృతిక సారథిని ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చైర్మెన్ గా రసమయి బాలకిషన్ ను నియమించింది. అయితే.. అర్హులైన కొందరు కళాకారులకు ఉద్యోగాలు రాలేదన్న విమర్శలు ఉన్నాయి. సారథిలోనూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా చైర్ పర్సన్ గా నియమితులైన వెన్నెల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారే అంశంపై ఉత్కంఠ నెలకొంది.  

ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!

#revanth-reddy #telangana #gaddar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe