DHARANI: త్వరలో ముగియనున్న ధరణి కథ.. రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదే!

తెలంగాణలో ధరణి కథ ముగియనున్నట్లు తెలుస్తోంది. భూముల కొలతల విషయంలో శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వే అంశం, నక్షా ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రతి వ్యవసాయ క్షేత్రానికి నక్షా తప్పనిసరి ఉండేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.

Dharani Portal: ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
New Update

DHARANI : భూ రికార్డుల విభాగాల పటిష్టతపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. భూ వివాదాలు ఉండకుండా ప్రతి వ్యవసాయ క్షేత్రానికి సర్వే నిర్వహించి నక్ష ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. సమగ్ర భూ సర్వేతోనే ఇది సాధ్య మవుతుందని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సర్వేతో భూ సమస్యలు ఇక ఉండవని, ధరణి సమస్యలు కూడా ఉండకుండా చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగానే ప్రతి వ్యవసాయ క్షేత్రాన్ని సర్వే చేసి నక్షలు రూపొందించి రైతులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Also Read : ఏఎస్ఐ నా పీక కోశాడు.. బ్లేడు గాట్లతో యువకుడి హల్ చల్!

ప్రతి వ్యవసాయ క్షేత్రానికి నక్షా తప్పనిసరి..

ధరణి సమస్యల పరిష్కారానికి, భూ వివాదాల తొలగింపునకు ప్రతి వ్యవసాయ క్షేత్రానికి తప్పనిసరిగా నక్షా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ధరణిలో అనేక అవకతవకలు జరిగాయని ఆర్వోఆర్-2024ను అమలులోకి తేవాలని యోచిస్తోంది. తాజాగా క్రయ విక్రయాలు జరిగే సమయంలో భూ నక్షా చిత్రం తప్పని సరిచేయాలని చూస్తోంది. ఈ క్రమంలో సర్వేయర్ల ఆవశ్యకత పెరిగింది. ఇప్పటివరకు వీరు పూర్తిస్థాయిలో లేకపోవడంతో గ్రామాల్లో భూ వివాదాలు పేరుకుపో యాయి. వీటి పరిష్కారానికి ధరణి వెబ్ సైట్లో చోటులేక వివాదస్పదంగా మారాయి. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే భూ రికార్డుల విభాగాల పటిష్టతపై కసరత్తు చేపట్టింది.  

Also Read :  ఇలాంటి బంగాళాదుంప తింటే ఏమవుతుందో తెలుసా..!అస్సలు ఊహించలేరు

రైతులను వేధిస్తున్న భూముల కొలతలు..

కొన్ని ప్రాంతాల్లో వ్యాప్తంగా సర్వేయర్ల కొరత కారణంగా భూముల కొలతలు రైతుల్ని వేధిస్తున్నాయి. వేల సంఖ్యలో కొలతల కోసం రైతులు అందజేసిన దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. సర్వేయర్ల కొరత ఉన్న చోట పక్క మండలాల వారికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీనికి తోడు ప్రభుత్వ పనులు అధికంగా ఉండటంతో దరఖాస్తులు పెండింగ్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రైతుల భూముల సర్వేలో జాప్యం ఏర్పడుతోందని పలువురు సర్వేయర్లు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: BIG BREAKING: కేటీఆర్ అరెస్టుకు డేట్‌ ఫిక్స్!

శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వే.. 

నిజాం పాలనలో సెత్వార్ పేరిట 1938-45 కాలంలో సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ గ్రామాల్లో పట్టాదారుల సమాచారంతో కాస్ట్రో-పహాణి తయారు చేసి అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం ఏర్పడ్డాక వాటినే కొలమానంగా రెవెన్యూ శాఖ పరిగణించింది. సమస్య ఏర్పడినప్పుడు విక్రయాలు జరిగి వివాదాలు తలెత్తిన సమయంలో భూ కొలతలు శాఖ వద్ద ఉన్న టిప్పన్(కొలతల పుస్తకం) రూపంలో కొనుగోలుదారుకు భూమిని అప్పజెబుతూ వస్తున్నారు. రెవెన్యూ శాఖ వద్ద ఉన్న కాస్ట్రా పహాణి ఆధారంగానే భూ దస్త్రాల ప్రక్షాళన కొనసాగించారు. అయినా భూముల వివాదాలు అపరిష్కృతంగానే మిగులుతున్నాయి. వాటి శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వే అంశం, నక్షా ఆధారం గానే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుండటంతో సర్వేయర్ల ప్రాధాన్యత మరింత పెరిగింది.

ఇది కూడా చదవండి: Rashmika: ఫస్టాఫ్ అద్భుతం,సెకండాఫ్ అంతకు మించి.. రష్మిక పోస్ట్ వైరల్

#dharani #telangana-government #CM Revanth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe