TG: జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్​ ఖరారు!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్​ రెడీ చేసింది. డిసెంబర్ చివరి వారంలోగా కులగణన సర్వే లెక్కలు పూర్తి చేసి సంక్రాతి తర్వాత ఎలక్షన్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

author-image
By srinivas
telangana elections:డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు-తాత్కాలిక షెడ్యూల్
New Update

TG: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్​ రెడీ చేసింది. డిసెంబర్ చివరి వారంలోగా కులగణన సర్వే లెక్కలు పూర్తి చేసి సంక్రాతి తర్వాత ఎలక్షన్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

సంక్రాతి తర్వాతే ఎన్నికలు.. 

ఈ మేరకు రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వచ్చె నెలలో హియరింగ్​ ఉంది. దీంతో డిసెంబర్​ రెండో వారం కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి జనవరిలో ఎన్నికలు కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది.​ కులగణన సర్వే వివరాలు రాగానే వాటిని డెడికేటెడ్ కమిషన్ కు అందించనుంది. అందులోని వివరాలు, కమిషన్​ చేసిన అధ్యయన నివేదిక రెండింటి ఆధారంగా రిజర్వేషన్లను ఎంతమేరకు పెంచాలనే దానిపై ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఇందులో భాగంగానే రిజర్వేషన్లను ఖరారు చేసి.. ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ అంతా డిసెంబర్​ చివరిలోగా పూర్తి కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చదవండి: TG: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. !

ఇదిలా ఉంటే.. డిసెంబర్​ చివరలో షెడ్యూల్​ రిలీజ్​ చేసి సంక్రాంతి పండుగ తర్వాత పోలింగ్​ నిర్వహించనున్నట్లు సమాచారం. 4 నుంచి 5 వేల గ్రామాలకు ఒక విడత చొప్పున 3 విడతల్లో ఎన్నికలు పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తెప్పించుకుని, గ్రామాలు, వార్డుల వారీగా పబ్లిష్​ చేసింది. షెడ్యూల్​ రిలీజ్​ కంటే ముందు మరోసారి సప్లిమెంటరీ ఓటర్ల జాబితాను తీసుకోనుంది. సర్పంచుల పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. కాగా ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో జీపీలు కొనసాగుతున్నాయి. 

ఇది కూడా చదవండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. రైతుల నుంచి గుంజుకున్న భూములపై విచారణ!

ఇది కూడా చదవండి: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్!

ఇది కూడా చదవండి: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. !

#telangana #panchayat-election #panchayat election schedule
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe