హరీష్ రావుకు బిగ్ షాక్.. రైతుల నుంచి గుంజుకున్న భూములపై విచారణ! బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి కొన్న భూములపై విచారణ జరిపిస్తున్నామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయన్నారు. By srinivas 22 Nov 2024 | నవీకరించబడింది పై 22 Nov 2024 08:11 IST in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి TG News: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి కొన్న భూములపై విచారణ జరిపిస్తున్నామంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రిజర్వాయర్ కోసం మొదట భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి, ఆ తర్వాత భూములు పోతాయని బెదిరించి తక్కువ ధరకే దక్కించుకున్నాడని ఆరోపించారు. పక్కా ఆధారాలున్నాయి.. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన పొంగులేటి.. హరీష్ రావు అవినీతిపై తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయని చెప్పారు. భూములు కొనగానే భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేశారని చెప్పారు. రైతుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నానని, ధరణిలో రికార్డు కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్న ఆయన.. భూసేకరణ నోటిఫికేషన్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ఒకసారి నోటిఫికేషన్ జారీ అయితే దాన్ని రద్దు చేయలేరని, గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ శివార్లలో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పటికీ మనుగడలో ఉందని గుర్తు చేశారు. ఇక కేటీఆర్‌ను ఎందుకు ఆరెస్టు చేయట్లేదని ప్రశ్నిస్తున్న బండి సంజయ్, కిషన్‌రెడ్డి గవర్నర్ నుంచి అనుమతి ఇప్పించాలన్నారు. ఇది కూడా చదవండి: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. ! #revanth-reddy #Land Grabbing Allegations #harish-rao #minister-ponguleti మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి