/rtv/media/media_files/2025/01/27/SO1FO9R4UqdX9jNmlOhS.webp)
Sangareddy Sagar suicide
TG Crime: హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ ద్వారకా నగర్‌కు చెందిన ధర్మారెడ్డి, సంగీత దంపతుల రెండవ కుమారుడు సంగారెడ్డి ఉప్పల్ న్యూ భారత్ నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే శనివారం ఉదయం క్లాస్ రూమ్‌లో పీటీ ఆంజనేయులు మందలించి.. కొట్టడంతో సంగారెడ్డి మనస్థాపానికి గురయ్యాడు.
పీటీ మందలించడంతోనే ఆత్మహత్య:
క్లాస్ టీచర్‌కి వాష్ రూమ్‌కి వెళ్లి వస్తానని చెప్పి నాలుగు అంతస్తుల బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే స్పందించిన సిబ్బంది, స్కూల్ కరస్పాండెంట్ దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే డాక్టర్లు పరీక్షించి అప్పటికే విద్యార్థి మృతి చెందాడని నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంగారెడ్డి మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూలుకు చేరుకున్నారు. అప్పటికే స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. సంగారెడ్డి మృతికి స్కూల్ సిబ్బంది కారణమని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా?.. అయితే.. ఈ విషయం మీ కోసమే!