డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఇంట్లో ఇటీవల చోరీగా జరగ్గా.. ఇప్పుడు మళ్లీ మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మంత్రి ఇంట్లో దీపావళి రోజున మొబైల్ చోరీకి గురైంది. ఆ మొబైల్‌ను వెతికి పెట్టాలని మంత్రి శ్రీధర్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీపావళికి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చూడండి: Amla: కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం!
గతంలో డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ..
ఇదిలా ఉండగా ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఇంట్లో కూడా చోరీ జరిగింది. భట్టి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు. చోరీ చేసిన దొంగలను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.
ఇది కూడా చూడండి: Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?
వెంటనే పోలీసులు ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వారు దొంగలమని ఒప్పుకున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్, ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. వారి వద్ద బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నామని బెంగాల్ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్
వరుసగా తెలంగాణలో చోరీలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ ఉండే రాజకీయ నాయకుల ఇంట్లోనే చోరీలు జరగడంతో మిగతా సామాన్య కుటుంబాల్లో కూడా ఇదే పరిస్థితి వాటిల్లతుందని ప్రజలు భయపడుతున్నారు.
ఇది కూడా చూడండి: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ!