తెలంగాణలో బస్ ఛార్జీలు పెంపు.. RTV ఇంటర్వ్యూలో మంత్రి పొన్నం క్లారిటీ!

రాష్ట్రంలో బస్ ఛార్జీలు పెంచే అవకాశం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు. బీసీ మంత్రుల పట్ల కేబినెట్లో వివక్ష ఉందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. బండి సంజయ్ తో తనకు విభేదాలు లేవన్నారు. RTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు.

New Update

గురుకులాలు, హాస్టళ్లలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గతంలో ఉన్న దాని కన్నా మెస్ ఛార్జీలు భారీగా పెంచామన్నారు. RTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు పొన్నం. కేబినెట్లో బీసీ మంత్రులపై వివక్ష లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పని ఒత్తిడితో కొందరు మంత్రులు హెలికాప్టర్ ఉపయోగించుకుని ఉండొచ్చన్నారు. తనకు ఆ అవసరం రాలేదన్నారు. బీసీ మంత్రులకు హెలికాప్టర్ ఇవ్వడం లేదన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: కేటీఆర్‌కు మరోసారి నోటీసులు.. ఇంటికి వెళ్లిన ఏసీబీ!

బస్సు ఛార్జీలు పెంచం..

కర్ణాటక మాదిరిగా తెలంగాణలో బస్ ఛార్జీలు పెరిగే అవకాశం లేదన్నారు. బండి సంజయ్ కు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. నవోదయ విద్యాలయాన్ని పీవీ నరసింహారావు స్వగ్రామం వంగరలో పెట్టాలని ఇటీవల బండి సంజయ్ ను కోరానన్నారు. అందుకు ఆయన ఒప్పుకున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి ప్రజలకు నష్టం లేకుండా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. పొన్నం ప్రభాకర్ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
ఇది కూడా చదవండి: ఆ ఫ్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు