BIG BREAKING: తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల!

తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9 లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనున్నట్లు ఎస్‌ఈసీ రాణికుముదిని వెల్లడించారు.

New Update
tg elc

Telangana Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9 లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనున్నట్లు ఎస్‌ఈసీ రాణికుముదిని వెల్లడించారు. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్‌ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుండగా అక్టోబర్‌ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 27న రెండో విడత పోలింగ్‌ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. 

 5 దశల్లో ఎన్నికల ప్రక్రియ

ఈ మేరకు మొత్తం 5 దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించనుండగా మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్‌ 31న, రెండో విడత నవంబర్‌ 4న, మూడో విడత నవంబర్‌ 8న నిర్వహిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత అదేరోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేస్తామన్నారు. నవంబర్‌ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్‌ఈసీ అధికారి రాణికుముదిని స్పష్టం చేశారు.

Also Read :  రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన MLA రాజ్‌గోపాల్ రెడ్డి

31 జిల్లాల్లోని 565 మండలాల్లో రెండు విడతల్లో 5,749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలుంటాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!

Advertisment
తాజా కథనాలు