/rtv/media/media_files/2025/01/09/0uJA8MXlfEKZqGKFxdW8.jpg)
King Fisher beer
TG News: తెలంగాణ మందుబాబులకు మరో గుడ్ న్యూస్ వెలువడింది. అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) రాష్ట్రంలో కేఎఫ్ బీర్ల సరఫరా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు సోమవారం అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. అలాగే బీర్ల ధరలకు సంబంధించిన పెంపు, బకాయిలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.
75 శాతం వాటా యూబీఎల్‌దే..
గత రెండు సంవత్సరాలనుంచి రూ.702 కోట్ల బకాయిలు కార్పొరేషన్ విడుదల చేయలేదు. దీంతో బీరు మూల ధరను సవరించాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో బీర్ల సరఫరాను నిలిపివేసినట్లు యూబీఎల్ పేర్కొంది. రాష్ట్రంలో 6 బీర్ల తయారీ సంస్థలున్నా మార్కెట్లోకి వచ్చే వాటిలో 75 శాతం వాటా యూబీఎల్‌దే కావడం గమనర్హం.
ఇది కూడా చదవండి: Meenakshi Chaudhary: ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయాలని ఉంది! ఇది నిజమేనా మీను..?
బీర్ల నిలిపివేతతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడింది. దీంతో మద్యం ధరల పెంపు అంశంపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వగా యూబీఎల్ సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: పోతూ.. పోతూ.. వీళ్లను ట్రంప్ నుంచి కాపాడటానికి జో బైడెన్ కీలక నిర్ణయం
ఇక ప్రస్తుతం ఉన్న ధరలకే సప్లై చేస్తారా? లేక మళ్లీ ధరలు పెంచుతారా అనేది తెలియాల్సివుంది. ధరల విషయంపై త్వరలోనే సమాచారం ఇస్తామని పేర్కొంది. ఇక కేఎఫ్ బీర్లు మళ్ళీ వస్తున్నాయనే వార్తతో తెలంగాణాలో మందుబాబులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.